Begin typing your search above and press return to search.

'రోజా' ఫేం మ‌ధుబాల కుమార్తెలు.. ఇండ‌స్ట్రీ షేకింగే!

ఇద్దరు కొత్త హీరోయిన్లు రాక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 2:30 AM GMT
రోజా ఫేం మ‌ధుబాల కుమార్తెలు.. ఇండ‌స్ట్రీ షేకింగే!
X

జాతీయ ఉత్త‌మ నటి, `రోజా` ఫేం మధుబాల సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు, త‌మిళ చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త‌న వార‌స‌త్వాన్ని ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని సంకేతాలు అందాయి. మ‌ధూ కొన్ని సంద‌ర్భాల్లో తన అందమైన కుమార్తెల అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేసుకున్నారు. అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. ఇద్దరు కొత్త హీరోయిన్లు రాక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

1999లో వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకున్న మధుకు ఇద్దరు కుమార్తెలు కీయా షా, అమేయ షా ఉన్నారు. ఇద్ద‌రు కుమార్తెలు వారి తల్లిదండ్రుల పోలిక‌ల‌తో అంద‌గ‌త్తెలుగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె రూపం అచ్చు గుద్దిన‌ట్టు మ‌ధూనే పోలి ఉండ‌టంతో అభిమానులు ఆ దివ్య‌మైన రూపాన్ని ఆరాధిస్తున్నారు. ప్ర‌స్తుతం కీయా, అమేయా అక‌డెమిక్ స్ట‌డీస్ ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాల్లో వారికి భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. త‌దుప‌రి సినీఇండ‌స్ట్రీలో క‌థానాయిక‌లుగా అడుగుపెడ‌తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇద్ద‌రు దివ్య‌మైన కుమార్తెల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేసేది ఎప్పుడు మ‌ధూ? అని సోష‌ల్ మీడియాల్లో అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

మధుబాల (మధు) తమిళంలో మమ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె. బాలచందర్ తెర‌కెక్కించిన `అజగన్`తో అరంగేట్రం చేసింది. మణిరత్నం `రోజా`లో నటించిన తర్వాత ఆమె పాన్-ఇండియన్ స్టార్ గా సంచలనంగా మారింది. ఇది స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ కి ఆరంగేట్ర చిత్రం కావ‌డం విశేషం.

ఆ త‌ర్వాత జెంటిల్‌మన్, పంజాలంకురుచి, యోధ, ఫూల్ ఔర్ కాంటే, వానమే ఎల్లాయ్, ప్రేమ్ యోగ్ వంటి అనేక ద‌క్షిణాది ఉత్త‌రాది చిత్రాలలో మ‌ధూ నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, కాలేజ్ కుమార్, అంత‌కుముందు ఆ త‌రువాత‌, త‌లైవి, శాకుంతలం వంటి చిత్రాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం మంచు విష్ణు క‌న్న‌ప్ప‌లోను న‌టిస్తోంది. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది.