స్టార్ వైవ్స్ లోగుట్టు బయటపెడుతున్న డైరెక్టర్
ముఖ్యంగా మధుర్ తెరకెక్కించిన ఫ్యాషన్ సినిమాకి జాతీయ అవార్డులు సైతం దక్కాయి.
By: Tupaki Desk | 28 Nov 2024 3:42 AM GMTఫేజ్ 3 వరల్డ్ లో చిత్రవిచిత్రాలపై సినిమాలు తీయడంలో మధుర్ భండార్కర్ పనితనం గురించి తెలిసిందే. అతడు సెలబ్రిటీ ప్రపంచంపై సెటైరికల్ సినిమాలను రూపొందించారు. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఉద్వేగాలపై అతడు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. క్రిటికల్ గా ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మధుర్ తెరకెక్కించిన ఫ్యాషన్ సినిమాకి జాతీయ అవార్డులు సైతం దక్కాయి.
వాస్తవ కథలను పాత్రలను అద్భుతంగా తెరపై సృజించే దర్శకుడు మధర్ భండార్కర్ కి ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వారందరికీ విజువల్ ట్రీట్‌ని అందించేందుకు రెడీ అవుతున్నాడు అతడు. కొంత గ్యాప్ వచ్చినా కానీ, మాధర్ ఈసారి మంచి కాన్సెప్టునే ఎంపిక చేసుకున్నారు. `వైవ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే టైటిల్ ని ఇప్పటికే లాక్ చేసి దానిని జస్టిఫై చేసే కథపై పని చేస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే వినోద ప్రపంచంలో స్టార్ వైవ్స్ తాలూకా చాలా రహస్యాలపై పరిశోధిస్తున్నాడని తెలిసింది. అయితే మెజారిటీ భాగం వారిలోని పాజిటివ్ కోణాలపై సినిమా తీస్తున్నాడట.
మాధుర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకుల అంచనాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. తాను ఒక నిర్దిష్ట అంశాన్ని వెల్లడిస్తానని తన సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు కాబట్టి దానిపైనా నిశితంగా పని చేస్తున్నానని తెలిపారు. థియేట్రికల్ గా నచ్చే థీమ్ ఎంపిక చేసుకున్నాం. టైటిల్ ఎంపికైనా కానీ ఇంకా దానిని ప్రకటించడం లేదు.
బాలీవుడ్ లో స్టార్ వైవ్స్ తెరవెనక కోణాల గురించి బయటి ప్రజలకు అంతగా తెలియదు. నిరంతర వార్తా స్రవంతిలో కొన్ని గాసిప్పులు కొన్ని నిజఘటనలు మినహా వారి వ్యక్తిగత జీవితాలు ఆలోచనా విధానం గురించి ప్రజలకు తెలిసింది తక్కువే. ఇప్పుడు భండార్కర్ అసలు లోగుట్టు బయటకు తీస్తున్నాడని భావించాలి. ఇటీవల సెలబ్రిటీ జంటల విడాకులు, వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా చర్చ సాగింది. బహుశా మాధర్ అలాంటి విషయాలపై దృష్టి సారిస్తున్నారా? అంటూ గుసగుసలు మొదలయ్యాయి. మధుర్ బాలీవుడ్ భామలపై దృష్టి సారించారు... మీడియాలో ప్రచారానికి అతీతంగా తెరవెనక ఏం జరిగిందో చూపిస్తాడేమో చూడాలి.