రొయ్యల కూరతో భర్తకు టార్చర్ చూపించిన నటి?
`భూల్ భులయా 3` చిత్రంతో తిరిగి తన అభిమానుల ముందుకు వస్తోంది మాధురి ధీక్షిత్.
By: Tupaki Desk | 27 Sep 2024 2:30 AM GMT`భూల్ భులయా 3` చిత్రంతో తిరిగి తన అభిమానుల ముందుకు వస్తోంది మాధురి ధీక్షిత్. భారీ తారాగణం నడుమ తన ప్రత్యేకతను నిలుపుకునే పాత్రలో మాధురి ధీక్షిత్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే మాధురి ధీక్షిత్ త్రోబ్యాక్ వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇందులో రొయ్యల కూర వండటం .. తన భర్తకు తినిపించడం గురించి మాట్లాడింది మాధురి. రొయ్యల్ని వండటంలో సంక్లిష్ఠతను, తినేప్పుడు ఆయన కష్టాన్ని కూడా చాలా ఫన్నీగా వివరించింది.
ఒకసారి రొయ్యల కూర చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను వెల్లడించింది. ఒకానొక టాక్ షో త్రోబాక్ వీడియోలో మాధురి ఇలా అన్నారు.. మీకు తెలుసా, ఒక మహిళ చాలా టోపీలు(బాధ్యతలు) ధరిస్తుందని నేను ఎప్పుడూ చెబుతాను. ఇది భార్య టోపీ.. ఇది అమ్మ టోపీ.. ఇది వృత్తిపరమైన టోపీ.. ఇది వంటవాడి టోపీ.. నేను చాలా సార్లు ఆశ్చర్యపోయాను.. అతడు కూడా.. అంటూ వ్యాఖ్యానించింది. నేను రొయ్యలు వండాను. నేను వాటిని 10-15 నిమిషాలు ఉడికించాను. వండేప్పుడు ఓహ్ ఇది నిజంగా బాగుంటుంది అనుకున్నాను. నేను ఆ రొయ్యలను వండటం పూర్తి చేసే సమయానికి అవి రబ్బరు లాగా సాగాయి. వాటిని చాలా నమిలి తిన్నారు ఆయన. ఆ తర్వాత ఏమి జరిగిందో మీరు ఊహించవచ్చు. అతను వాటిని తిన్నాడు.. అతడు నిజంగా మంచివాడు. మీకు తెలుసా? నాకు మంచి అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తున్నానని అతడు చెప్పాడు.. చింతించకండి మీరు దాన్ని(అనుభూతిని) పొందుతారు`` అంటూ ముగించింది మాధురి.
మాధురీ దీక్షిత్ 17 అక్టోబర్ 1999న దక్షిణ కాలిఫోర్నియాలోని తన సోదరుడి నివాసంలో జరిగిన సాంప్రదాయ వేడుకలో డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనేని వివాహం చేసుకున్నారు. ముంబైలో జరిగిన వారి వివాహ రిసెప్షన్‌కు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, శివసేన అధినేత బాల్ థాకరే, దిలీప్ కుమార్, సైరా బాను, యశ్ చోప్రా, శ్రీదేవి వంటి ప్రముఖులు హాజరయ్యారు. తరువాత ఒక దశాబ్దం పాటు కొలరాడోలోని డెన్వర్‌కి మకాం మార్చారు. 17 మార్చి 2003న అరిన్ అనే కుమారుడికి మాధురి జన్మనిచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత ఆమె 8 మార్చి 2005న ర్యాన్ అనే మరో కొడుకుకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2011లో మాధురీ దీక్షిత్ తన కుటుంబంతో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత నటనను కొనసాగిస్తున్నారు.