డైరెక్టర్ తో మాధురి దీక్షిత్ గొడవ!
బాలీవుడ్ అందాల వెటరన్ నటి మాధురి దీక్షిత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2024 3:15 AM GMTబాలీవుడ్ అందాల వెటరన్ నటి మాధురి దీక్షిత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్నో వైవిథ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. టెలివిజన్ హోస్ట్ గానూ మాధురీ మార్క్ పడింది. అయితే ఇటీవలి కాలంలో నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
గతేడాది `పంచక్` సినిమాని నిర్మించారు. 2024 లో మాత్రం ఎలాంటి సినిమాతో పలరిస్తుంది? అన్న సంగతి మాత్రం ఇంకా ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే అప్పట్లో దర్శకుడు టీనూ ఆనంద్ తో మాధురి దీక్షిత్ గొడవ పడినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటి మీడియాలో ఈ వార్త పెద్దగా వైరల్ కాలేదు. దీంతో ఇది ప్రచారమా? లేక నిజంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? అన్న విషయంపై దర్శకుడ్ని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆయన అంగీకరించి షాక్ ఇచ్చారు. తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. `అమితాబ్ -మాధురి దీక్షిత్ జంటగా 1989 లో `శనక్త్` చిత్రాన్ని మొదలుపెట్టా. కొంత భాగం షూటింగ్ చేసాం. కొన్ని కీకల సన్నివేశాలు డిమాండ్ చేయడంతో మాధురి దీక్షిత్ ని లో దుస్తుల్లో నటించమని కోరాను. అప్పుడు నా కండీషన్ కి మాధురీ కూడా ఒప్పుకుంది.
సెట్ లో ఆ సన్నివేశాల చిత్రీకరణకు అంతా సిద్దం చేసుకున్నాను. అయితే సరిగ్గా కెమెరా ముందుకొచ్చిన తర్వాత లో దుస్తుల్లో నటించనని ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంది. దీంతో నేను సీరియస్ అయ్యాను. నా కండీషన్ ముందే చెప్పాను..అగ్రిమెంట్ మీద సంతకం ఉంటుంది. ఇప్పుడు నటించనంటే ఎలా అని సీరియస్ అయ్యాను. అయినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ సినిమా షూటింగ్ అప్పటికప్పుడు నిలి పివేసాం. ఆమె కారణంగా శనక్త్ సినిమా ఆగిపోయింది` అని తెలిపారు.