Begin typing your search above and press return to search.

ఈ 'MAD' వల్ల వార్తల్లో ఆ 'MAD' ..!

తాజాగా వచ్చిన 'MAD' సినిమాను నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేస్తూ ఉండగా.. 2021 లో 'MAD' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:12 AM GMT
ఈ MAD వల్ల వార్తల్లో ఆ  MAD ..!
X

ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో కొన్ని బాగా సందడి చేశాయి. సోషల్ మీడియాతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సండి చేసిన ఆ చిన్న సినిమాల్లో 'MAD' సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. చిన్న సినిమా అయినా కూడా పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించడం వల్ల మంచి వసూళ్లు నమోదు చేసింది.

సంగీత్‌ శోభన్‌, నార్నె నితిన్, నితిన్ రామ్‌ లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కి యూత్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను ఈ సినిమా రాబట్టడంతో నిర్మాతలకు మరియు బయ్యర్లకు భారీగా లాభాలు వచ్చాయి అంటూ ప్రచారం జరిగింది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన 'MAD' ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్‌ కూడా అయిన విషయం తెల్సిందే.

'MAD' సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా ఓటీటీ లో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. అయితే ఈ క్రమంలో మరో 'MAD' సినిమాను కొందరు చూస్తున్నారు. తాజాగా వచ్చిన 'MAD' సినిమాను నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేస్తూ ఉండగా.. 2021 లో 'MAD' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు.

ఒకే టైటిల్‌ రెండు సినిమాలకు ఎలా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 2021 లో వచ్చిన 'MAD' సినిమా గురించి ఆ సమయంలో పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. గూగుల్‌ లో రెండేళ్ల క్రితం వచ్చిన మ్యాడ్‌ లో ఏముంది, ఎవరున్నారు అంటూ సెర్చ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గూగుల్ లో కొందరు మ్యాడ్‌ అంటూ సెర్చ్ చేసి అమెజాన్ ప్రైమ్‌ లో ఉన్న సినిమాను చూస్తున్నారు. హిట్ మూవీ అన్నారు.. ఇలా ఉందేంటి అంటూ కొందరు నోరు వెళ్లబెడుతున్నారట. మొత్తానికి రెండు మ్యాడ్‌ సినిమాలు ఉండటంతో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.