Begin typing your search above and press return to search.

మ్యాడ్ మ్యాక్స్.. సౌండ్ షురూ!

ఈ విషయాన్ని నేడు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. "మరో స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు మ్యాడ్‌ టీమ్‌ మరోసారి కలిసింది.

By:  Tupaki Desk   |   19 April 2024 1:50 PM GMT
మ్యాడ్ మ్యాక్స్.. సౌండ్ షురూ!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. గతేడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ సినిమా ఏకంగా రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే ఈ మూవీ సీక్వెల్ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మ్యాడ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ శంకర్. మ్యాడ్ సీక్వెల్ తెరకెక్కిస్తామని చెప్పారు. ఇటీవల మ్యాడ్ మూవీ సీక్వెల్ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

ఈ విషయాన్ని నేడు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. "మరో స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు మ్యాడ్‌ టీమ్‌ మరోసారి కలిసింది. ఇప్పుడు మ్యాడ్‌ నెస్‌ రెట్టింపు స్థాయిలో ఉండనుంది. ఉగాది పండుగ రోజున మ్యాడ్‌ స్క్వేర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించాం" అని తెలిపింది. ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కేవీ అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక మ్యాడ్ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో కనిపించే హీరోలే నటించనున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ట్రియో ఈ సీక్వెల్ కోసం మళ్లీ రంగంలోకి దిగారని పూజా కార్యక్రమం ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే హీరోయిన్లు మాత్రం మారనున్నారు. త్వరలోనే కొత్త బ్యూటీల వివరాలు వెల్లడించనున్నారు. సీక్వెల్ లో మరికొందరు కొత్త వాళ్లు కూడా నటించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాకు గాను ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. శ్యామ్‌ దత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, భీమ్స్ సిసరోలియో సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో నటీనటుల కామెడీ టైమింగ్‌ కు సినీ ప్రియులంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. మరి సీక్వెల్ ఎలా నవ్విస్తుందో చూడాలి.