Begin typing your search above and press return to search.

మ్యాడ్ సీక్వెల్.. వచ్చేది ఎప్పుడు?

తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అయ్యిందంట. గుంటూరు కారం కోసం ప్రత్యేకంగా వేసిన హౌస్ సెట్ లోనే ఈ మూవీలో కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారంట.

By:  Tupaki Desk   |   16 April 2024 4:07 AM GMT
మ్యాడ్ సీక్వెల్.. వచ్చేది ఎప్పుడు?
X

కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ లోనాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అవుట్ అండ్ అవుట్ హీలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అయ్యాడు.

సంతోష్ శోభన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆధ్యంతం వినోదాన్ని పండించాడు. అందుకే యూత్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి సీక్వెల్ కూడా రాబోతోందని గతంలో నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అయ్యిందంట. గుంటూరు కారం కోసం ప్రత్యేకంగా వేసిన హౌస్ సెట్ లోనే ఈ మూవీలో కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారంట.

మ్యాడ్ మ్యాక్స్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా రిలీజ్ చేసే విధంగా నిర్మాత నాగ వంశీ ప్లాన్ చేసుకుంటున్నారంట. వీలైనంత వేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మ్యాడ్ మూవీకి కొనసాగింపుగా ఉంటుందా లేదంటే కంప్లీట్ గా కొత్త కథతో ఈ సీక్వెల్ చేస్తున్నారా అనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే మ్యాడ్ చిత్రంలో చేసిన సంతోష్ శోభన్, నార్నె నితిన్, నితిన్ రామ్ పాత్రలు ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. మొదటి సినిమాకి మించి ఫుల్ హిలేరియస్ కామెడీతో మ్యాడ్ మ్యాక్స్ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మ్యాడ్ సినిమాని 5 నుంచి 10 కోట్ల మధ్య బడ్జెట్ తో నిర్మించారు. ఓవరాల్ గా ఈ సినిమాలో 26 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సినిమాలో నటించిన ముగ్గురు హీరోలకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా సంతోష్ శోభన్ ఇమేజ్ కూడా మ్యాడ్ సినిమాతో అమాంతం పెరిగిపోయింది. మ్యాడ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న మ్యాడ్ మ్యాక్స్ కచ్చితంగా 50 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.