మదరాసి ఎవరి ఫేట్ మారుస్తుంది..?
సినిమా రేంజ్ ఏంటన్నది గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. మురుగదాస్ శివ కార్తికేయన్ ఈ కాంబో ఎవరికి లక్ ఫేవర్ చేస్తుందా అన్నది చూడాలి.
By: Tupaki Desk | 18 Feb 2025 12:30 AM GMTకోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. అమరన్ సినిమాతో కెరీర్ లో 300 కోట్ల హైయ్యెస్ట్ కలెక్షన్స్ తో తన బాక్సాఫీస్ స్టామినా ఇదని ప్రూవ్ చేశాడు. ఒక సాధారణ వీజేగా కెరీర్ మొదలు పెట్టిన శివ కార్తికేయన్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చి ఆ క్రేజ్ తో మంచి అవకాశాలు అందుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఒక దానికిమించి మరొకటి అనిపించేలా సినిమాలు చేస్తున్నాడు శివ కార్తికేయన్.
ఇక తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన ఈ హీరో కెరీర్ ప్లానింగ్ తో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో మదరాసి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే కచ్చితంగా శివ కార్తికేయన్ ఇమేజ్ పెంచే సినిమాగా ఇది అవుతుందని అనిపిస్తుంది.
ఇప్పుడంటే ఫాం కోల్పోయాడు కానీ ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మురుగదాస్ అదరగొట్టాడు. అలాంటి డైరెక్టర్ కొన్ని ఫ్లాపులు పడగా ఇప్పుడు శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడు. శివ కార్తికేయన్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు మురుగదాస్. ఐతే మురుగదాస్ తో సినిమా చేయడం శివ కార్తికేయన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనేలా ఉంటుందని చెప్పొచ్చు. మదరాసి టైటిల్ ఇంకా ఫస్ట్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది.
సినిమా రేంజ్ ఏంటన్నది గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. మురుగదాస్ శివ కార్తికేయన్ ఈ కాంబో ఎవరికి లక్ ఫేవర్ చేస్తుందా అన్నది చూడాలి. పాన్ ఇండియా రేంజ్ లో కోలీవుడ్ సినిమాల ప్రభావం చాలా తక్కువగా ఉంది. స్టార్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్న వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఐతే మురుగదాస్ శివ కార్తికేయన్ ఈ కాంబో సినిమాపై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా గజిని సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ గా మురుగదాస్ కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా అవడం వల్ల అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఒకప్పటి మురుగదాస్ లా సినిమా పడితే మాత్రం శివ కార్తికేయన్ కి హిట్ పడినట్టే లెక్క. అంతేకాదు శివ కార్తికేయన్ కి కూడా ఈ టైం లో ఇది సరైన సినిమా అనే చెప్పొచ్చు.