Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: బిగ్‌బాస్‌లోకి మాఫియా?

ఎన్ని సెటిల్ మెంట్లు ఆగిపోయాయో తెలుసా స‌ర్ మీకు.. ఎన్ని ప్రాప‌ర్టీలు పెండింగ్ లో ప‌డిపోయాయో తెలుసా మీకు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 4:31 PM GMT
ట్రెండీ టాక్‌: బిగ్‌బాస్‌లోకి మాఫియా?
X

మీ ద‌య వ‌ల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది స‌ర్.. గ్యాంగ్‌స్ట‌ర్స్ అందరూ చెదిరిపోయారు. ముంబైలో భాయ్ అనే వాడు లేకుండా చేసిప‌డేసారు స‌ర్.. ఇండియా దిక్కు లేనిదైపోయింది. ఎన్ని సెటిల్ మెంట్లు ఆగిపోయాయో తెలుసా స‌ర్ మీకు.. ఎన్ని ప్రాప‌ర్టీలు పెండింగ్ లో ప‌డిపోయాయో తెలుసా మీకు. కొన్ని వేల కోట్ల ట్రాన్జాక్ష‌న్స్ ఆగిపోయాయి స‌ర్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చ‌ని ఎన్నో మాఫియా సెటిల్ చేస్తుంది స‌ర్.. అలాంటి మాఫియాను తొక్కేస్తారా స‌ర్.. ఏం చేసింది స‌ర్ మాఫియా.. రోడ్ ల మీద ప‌డి రేప్ లు చేసామా మ‌ర్డ‌ర్లు చేసామా? ఇండియాలో డ‌బ్బున్న బ‌డా బ‌డా శాల్తీల‌తో ఆడుకుంటాం స‌ర్..

ఈ డైలాగ్ `బిజినెస్‌మేన్` సినిమాలోనిది. పూరి జ‌గ‌న్నాథ్ ర‌చ‌యిత‌. సూర్య భాయ్ (సూప‌ర్ స్టార్ మ‌హేష్) డెన్‌కి వ‌చ్చి త‌న యాక్టివిటీస్ పై డౌట్లు వ్య‌క్తం చేస్తూ త‌న‌ను నిల‌దీసిన ముంబై పోలీస్ క‌మీష‌న‌ర్ నాజ‌ర్ ముందు సూర్య భాయ్ ఛాలెంజ్ చేసే స‌న్నివేశంలో వ‌చ్చే ఈ డైలాగ్ గూస్ బంప్స్ తెస్తాయి. దీనిని ఇప్పుడే ఎందుకు గుర్తు చేయాల్సి వ‌స్తోంది! అంటే.. మాఫియా ఎక్క‌డో లేదు మ‌న చుట్టూనే ఉంది అని చెప్ప‌డానికే!

ఇటీవ‌ల ముంబైని, ముంబైలో ఉన్న సెల‌బ్రిటీల‌ను, పెద్ద‌ స్టార్ల‌ను ఒక ఆట ఆడుతున్నాడు పంజాబీ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్. అత‌డి గ్యాంగ్ స‌ల్మాన్ ఖాన్ స‌హా ప‌లువురు స్టార్ల‌ను సోష‌ల్ మీడియాల్లో బెదిరించిన వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. బిష్ణోయ్ కి మాత్ర‌మే ఈ డిజిట‌ల్ టీమ్ అనుచ‌రులు కాదు.. వీరు బిగ్ బాస్ సీజన్ 18లో రజత్ దలాల్‌కు మద్దతు ఇచ్చిన ఎల్విష్ యాదవ్ అభిమానులు కూడా. రజత్ దలాల్ బిగ్ బాస్‌లో టాప్ 2లో చేర‌లేక నిష్క్ర‌మించాక మాఫియా లో క‌ద‌లిక వ‌చ్చింది. వీరంతా స‌ల్మాన్ పై చాలా సీరియ‌స్ గా ఉన్నారు. ర‌జ‌త్ ద‌లాల్ ఎలిమినేష‌న్ ని త‌ట్టుకోలేక భాయ్ పై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓవైపు సైఫ్ అలీఖాన్ పై క‌త్తి దాడికి పాల్ప‌డిన దుండ‌గుడి గురించి ముచ్చ‌టించుకుంటూనే స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18తో ముడిప‌డి ఉన్న గ్యాంగ్ స్ట‌ర్ ఫ్యాన్స్ గురించి కూడా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

కరణ్ వీర్ మెహ్రా , వివియన్ దేవ్‌సేనా ఇప్పుడు బిగ్ బాస్ 18 లో టాప్ 2 కంటెస్టెంట్లుగా ఉన్నారు .. రజత్ దలాల్ పూర్తిగా వైదొల‌గిన‌ట్టే. రియాలిటీ షో నియ‌మాల ప్ర‌కారం అత‌డు ఫైన‌లిస్ట్ కావ‌డానికి అన‌ర్హుడు. కానీ త‌మ అభిమాన ద‌లాల్ ఎలిమినేష‌న్ ని అడ్డుపెట్టుకుని హోస్ట్ స‌ల్మాన్ ని బెదిరించ‌డం స‌బ‌బేనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.