Begin typing your search above and press return to search.

ప్రేక్ష‌కాభిమానులకు షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్!

త‌ల అజిత్ క‌థానాయకుడిగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విదాముయార్చి` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Jan 2025 8:30 AM GMT
ప్రేక్ష‌కాభిమానులకు షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్!
X

త‌ల అజిత్ క‌థానాయకుడిగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విదాముయార్చి` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన చిత్రం అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డింది. విడుద‌ల ఆస‌ల్య‌మైనా? అంచ‌నాలు మాత్రం ఎక్క‌డా స‌న్న‌గిల్ల‌లేదు. ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి. ఫిబ్ర‌వ‌రి 6న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చారం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.

`స‌రిగ్గా ఇదేస‌యంలో అజిత్ కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అజిత్ ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న త‌ర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. అవార్డు రావ‌డంతో `విదాముయార్చి` మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగానూ మారింది. ప‌క్కా హిట్ కంటెంట్ అవ్వాల‌ని అభిమానులు ఆశిస్తు న్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా గురించి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు మాజిగ్ తిరుమ‌నేని.

సినిమా గురించి కొన్ని ఆస‌క్తిర విష‌యాలు రివీల్ చేసారు. `ఇది అద్భుతమైన సినిమా. కానీ 'విదాముయార్చి'లో పంచ్ డైలాగ్స్ ఉండ‌వు. అజిత్ సర్ పై గ్రాండ్ ఎంట్రీ స‌న్నివేశాలుండ‌వు. అలాగే బ‌ల‌మైన ఇంటర్వెల్ బ్లాక్ ఉండదు. కానీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసే చిత్రం. అభిమానుల‌కు ఇంకా న‌చ్చుతుంది. ఆ న‌మ్మ‌కం నాకు బ‌లంగా ఉంది. అదే న‌మ్మ‌కంతో మీ అంద‌రి ముందుకు వ‌స్తున్నాం. ఈ క‌థ హీరోయిజం..మాస్ అంశాల‌కు ప్రాముఖ్య త‌నిచ్చేది కాదు.

అందుకే ఆ ఛాన్స్ తీసుకోలేదు. సినిమా ఎలా ఉండాలి? అన్న‌ది అజిత్ స‌ర్ నాకు స్ప‌ష్టంగా చెప్పారు. అలాంటి స‌న్నివేశాల‌తో ఇద్ద‌రం మ‌రో సినిమా చేస్తాం` అన్నారు. దీంతో అభిమానుల‌కు ఇదో షాకింగ్ న్యూస్ లా మారింది. అజిత్ సినిమా అంటే భారీ యాక్ష‌సన్నివేశాలు..పోరాట ఘట్టాలు..మాస్ ఎలివేష‌న్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో అవేవి ఉండ‌వ‌ని ముందే చెప్పేసి ఆడియ‌న్స్ ని డైవ‌ర్ట్ చేయ‌డం మంచిదే. లేదంటే? ఈ మ‌ధ్య సినిమాలన్నీ అలాగే ఫెయిల‌వుతున్నాయి.