Begin typing your search above and press return to search.

మహా కుంభ మేళా...ప్రపంచ రికార్డు

పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి శుభ ఘడియలలో జనవరి 13న తెల్లవారు జాముల అమృత స్నానాలు భక్తులు ఆచరించడంతో ఈ మహా కుంభమేళ స్టార్ట్ అయింది

By:  Tupaki Desk   |   14 Jan 2025 5:45 AM GMT
మహా కుంభ మేళా...ప్రపంచ రికార్డు
X

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మహా కుంభమేళ మొదలైంది. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి శుభ ఘడియలలో జనవరి 13న తెల్లవారు జాముల అమృత స్నానాలు భక్తులు ఆచరించడంతో ఈ మహా కుంభమేళ స్టార్ట్ అయింది.

ఈ మహా కుంభ మేళా దేశ విదేశాల నుంచి ఏకంగా 40 నుంచి 45 వేల కోట్ల మంది భక్తుకు వస్తారని ఒక అంచనా. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా ఏకంగా 45 రోజుల పాటు నిరాటంకంగా సాగే ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక క్రతువుకు యాభై నుంచి అరవై దేశాల నుంచి యాత్రికులు, భక్తులు, సందర్శకులు అంతా హాజరవుతున్నారు

ఈ కుంభ మేళాకు వచ్చే భక్తులు చూస్తే ప్రపంచం జనాభాలో ఇరవై వంతు మహా కుంభ మేళాలోనే ఉంటుంది తొలి రోజే కోటి మంది భక్తులు స్నానమాచరించినట్లుగా లెక్కలు చెబుతునాయి. దీనిని చూస్తే కనుక 45 రోజులలో అతి పెద్ద ప్రపంచ రికార్డునే ఈ కుంభ మేళా కొట్టనుంది అని అంటున్నారు.

తొలి రోజు గడ్డ కట్టే చలిలో విదేశీ భక్తులు స్నానాలు చేశారు. ఈ సందర్భంగా వారు చెప్పేది ఒక్కటే. తమ మనసులలో ఆధ్యాత్మిక వేడి ఉందని అందుకే తాము చాలా హాయిగా ఈ స్నానాలు చేశామని. ఇక భారతీయ సనాతన ధర్మం గొప్పదని వారు వేయి నోళ్ళతో పొగుడుతున్నారు.

తాము దానినే ఆచరిస్తామని గౌరవిస్తామని చెప్పడం కంటే భారత్ కి కావాల్సినది ఏముంటుంది అన్నదే అందరి మాట. ఇక ఉత్తర ప్రదేస్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం అతి పెద్ద మహా కుంభ మేళా కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసాయి. యూపీలోని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలను ఈ మహా కుంభ మేళా కోసం కేటాయించింది.

కోట్లాదిమంది భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసి అన్నీ సిద్ధంగా ఉంచింది. ఇక చూస్తే కనుక భక్తులు, యాత్రికులు రియు సందర్శకులు గంగా, యమునలతో పాటుగా పౌరాణిక నదిగా పేరు గడించిన సరస్వతి నదితో కలసి త్రివేణీ అయింది. అలా పవిత్రమైన త్రివేణి సంగమంలోని వివిధ ఘాట్‌లలో లక్షలాది భక్తులు రాత్రి పగలు తేడా లేకుందా పవిత్ర స్నానాలు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే మహా కుంభమేళాకు ఆధ్యాత్మిక పరంగాఎన కాకుందా ఖగోళ శాస్త్ర పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమరికగా దీనిని చూస్తారు. అలా 2025లో వచ్చిన ఈ మహా కుంభ మేళ ఎంతో ప్రత్యేకతను పెంచుతోంది అని చెప్పాల్సి ఉంది.

మహా కుంభమేళ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు ఇది మెగా కల్చర్ ఈవెంట్ గా కూడా ఉంది. అంతే కాదు దేశీయ కల్చలర్ టూరిజాన్ని మరో పది రెట్లు పెంచేదిగా ఉంది అంటున్నారు. కోట్లాది మంది ప్రపంచ సందర్శకులను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడం మామూలు విషయం అయితే కానే కాదు అని చెప్పాలి.

ఇక ఈ గ్లోబర్ ఈవెంట్ తో ఏకంగా యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా కల్చరల్ అండ్ డివోషనల్ టూరిజం ద్వారా రానుంది అని చెబుతున్నారు. ఆ నంబర్ ఇంకా పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం మీద మహా కుంభమేళ మాత్రం భారత దేశ అతి పెద్ద కల్చరల్ డివోషనల్ టూరిజం ఈవెంట్ గా చెబుతున్నారు. భక్తులు యాత్రికుల కోసం మంచి ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం మహా కుంభ మేళ నిర్వహణతో ప్రపంచ రికార్డులను సాధించ దిశగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి.