Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్ కేసు: మ‌రో న‌లుగురు స్టార్ల‌కు ఈడీ స‌మ‌న్లు

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కి ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Oct 2023 5:04 AM GMT
బెట్టింగ్ యాప్ కేసు: మ‌రో న‌లుగురు స్టార్ల‌కు ఈడీ స‌మ‌న్లు
X

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కి ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ తో పాటు ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో ముగ్గురు స్టార్ల‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో దాదాపు 14-15 మంది సెలబ్రిటీలు .. నటీనటులు ED స్కానర్‌లో ఉన్నారు. వారికి త్వరలో సమన్లు వచ్చే అవకాశం ఉందని జాతీయ‌ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.


మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణకు సంబంధించి హుమా ఖురేషి, కపిల్ శర్మ, శ్రద్ధా కపూర్- హీనా ఖాన్‌ సహా మరికొంద‌రు నటీనటులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. ఆర్టిస్టులందరూ ప్రోబ్ ఏజెన్సీ నుండి రెండు వారాల సమయం కావాల‌ని కోరిన‌ట్టు స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది.

ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ను విచారణకు పిలిచిన ఒక రోజు తర్వాత మ‌రో న‌లుగురు ప్ర‌ముఖ స్టార్ల‌కు స‌మ‌న్లు అంద‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వర్చువల్ (ఆన్‌లైన్) స్పేస్‌లో తమ ఉత్పత్తిని ప్రచారం చేయడం కోసం యాప్ ప్రమోటర్ల నుండి ర‌ణ‌బీర్ కపూర్ డబ్బు అందుకున్నారని ఏజెన్సీ ఆరోపించింది. అక్టోబరు 6న ఏజెన్సీ కి చెందిన‌ రాయ్‌పూర్ కార్యాలయంలో హాజరు కావాలని ED ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ కపూర్‌ను కోరింది. అయితే ర‌ణ‌బీర్ కేంద్ర ఏజెన్సీ నుండి రెండు వారాల సమయం కోరారు.

దాదాపు 15 మంది ప్రముఖులు ED రాడార్‌లో

ఈ కేసులో దాదాపు 14-15 మంది ఇతర ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ప‌లువురు న‌టీనటులు ఈడీ స్కానర్‌లో ఉన్నారు. వీరంద‌రికీ త్వరలో సమన్లు వచ్చే అవకాశం ఉంది. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ఇడి దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ప్ర‌తి బ్రాంచ్ కి భాగ‌స్వామితో ఒక ఒప్పందం ఉంటుంది. ద‌గ్గ‌ర‌గా తెలిసిన అసోసియేట్‌లకు 70-30 లాభాల నిష్పత్తిలో ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుందని ఏజెన్సీ గుట్టు విప్పింది.

ఏజెన్సీ అందించిన‌ వివ‌రాల ప్రకారం.. బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరుగుతాయి. కొత్త వినియోగదారులను ఫ్రాంచైజ్ కోరేవారిని ఆకర్షించడానికి బెట్టింగ్ వెబ్‌సైట్‌ల ప్రకటనల కోసం భారతదేశంలో నగదు రూపంలో భారీ వ్యయం కూడా ఖ‌ర్చు చేసారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ అనేది కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, వినియోగదారు IDలను సృష్టించడానికి.. బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండరింగ్ చేయడానికి అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే గొడుగు సిండికేట్. కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవార‌ని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్ల‌డించారు.