ఎస్ ఎస్ ఎంబీ 29 మార్చి కెళ్తుందా?
#ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ప్రీ ప్రొడక్షన పనులు మొత్తం పూర్తి చేసి జనవరి 15 తర్వాత రెగ్యలర్ షూటింగ్ కి వెళ్లాలని రాజమౌళి అండ్ కో పనిచేస్తోంది.
By: Tupaki Desk | 24 Nov 2024 11:39 AM GMT#ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ప్రీ ప్రొడక్షన పనులు మొత్తం పూర్తి చేసి జనవరి 15 తర్వాత రెగ్యలర్ షూటింగ్ కి వెళ్లాలని రాజమౌళి అండ్ కో పనిచేస్తోంది. ప్రస్తుతం టీమ్ తో పాటు మహేష్ కూడా ఉన్నారు. రాజమౌళి, మహేష్ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన వారంతా ఆప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అవసరం మేర వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇంకా సినిమాలో హీరోయిన్, విలన్ ఎవరు? అన్నది ఫైనల్ కాలేదు.
అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆ రీచ్ ఉండేలా హాలీవుడ్ భామనే దించాలనే ఆలొచనలో మేకర్స్ ఉన్నట్లు వినిపిస్తుంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం ప్రణాళిక అంతా రాజమౌళి అనుకున్న ప్రకారమే వెళ్తుంది. అయితే ఆయన వద్ద ప్లాన్ బీ కూడా సిద్దంగా ఉంటుంది. ప్లాన్ ఏ ఫెయిలైతే వెంటనే ప్లాన్ బీని అమలు పరిచేలా ముందుగానే సిద్దం చేసి పెడతారు.
దీనిలో భాగంగా షూటింగ్ జనవరి 15 తర్వాత సాధ్యం కాకపోతే మార్చి లో పట్టాలెక్కించాలన్నది మరో ప్లాన్ గా ముందు కెళ్తున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ జనవరి 15 తర్వాత ఎలాంటి ఇష్యూ లేకుండా లేకుండా షూటింగ్ కోసం డేట్లు కేటాయించగల్గితే రాజమౌళి ప్లానింగ్ ప్రకారం సెట్స్ కి వెళ్లిపోతారుట. లేదంటే? మార్చి నుంచి వెళ్దామనే మరో ఆప్షన్ కూడా మహేష్ ముందు ఉంచినట్లు సమాచారం.
దీన్ని బట్టి మహేష్ కి కూడా కొంత వెసులు బాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ కి వెకేషన్లు ఏవైనా ఉన్నా జనవరి 15 లోపు ముగించుకోవాలి. లేదంటే? మార్చి లోగా ముగించాలి. ఆ తర్వాత పూర్తిగా రాజమౌళికి మహేష్ సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి షూట్ ప్రారంభమైన తర్వాత రాజమౌళి హీరోని బయటకు వదిలే పరిస్థితి ఉండదు. ముగించే వరకూ బాండ్ అయి పని చేయాల్సిందే. అందుకే రాజమౌళి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.