Begin typing your search above and press return to search.

మహానటి వినోదాల సుడిగాలితో రెడీ..!

మహానటి సావిత్రి బయోపిక్‌ 'మహానటి' తో పాన్ ఇండియా స్టార్‌డమ్ ను దక్కించుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:32 AM GMT
మహానటి వినోదాల సుడిగాలితో రెడీ..!
X

మహానటి సావిత్రి బయోపిక్‌ 'మహానటి' తో పాన్ ఇండియా స్టార్‌డమ్ ను దక్కించుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కించుకుంది. గత ఏడాది చిరంజీవి కి సోదరి గా భోళా శంకర్ లో నటించింది. తెలుగు లో పెద్దగా సినిమాలు కమిట్ అవ్వని ఈ అమ్మడు తమిళ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తోంది.

తమిళంలో ఈ అమ్మడి కొత్త సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. కేజీఎఫ్‌, సలార్‌ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే వారు తమిళ్ లో మొదటి సారి కీర్తి సురేష్ హీరోయిన్‌ గా 'రఘు తాత' అనే సినిమాను నిర్మిస్తున్నారు.

లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా వినోదాల విందు ఇవ్వడం ఖాయం అంటూ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పేర్కొంది. హీరోయిన్‌ గా కీర్తి సురేష్ కి ఒక మంచి సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని కూడా అంటున్నారు.

ఇదే సమయంలో సినిమా హిందీ భాషకు వ్యతిరేకం అయ్యి ఉంటుందా అనే అనుమానాలు కలిగే విధంగా 18 సెకన్ల టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్ ను షేర్‌ చేసిన కీర్తి సురేష్ వినోదాల సుడిగాలి రానుంది, మీరు అంతా రెడీగా ఉండండి అన్నట్లుగా ట్వీట్‌ చేసింది. మరి నిజంగానే వినోదాన్ని రఘు తాత అందించేనా చూడాలి