Begin typing your search above and press return to search.

చైనాలో మహారజ పరిస్థితి ఏంటి..?

ఇంత వైడ్ రేంజ్ లో రిలీజైన ఈ సినిమా కచ్చితంగా ఇదివరకు రిలీజైన అన్ని భారతీయ సినిమాల రికార్డులు కొట్టేస్తుంది అనుకున్నారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 5:34 AM GMT
చైనాలో మహారజ పరిస్థితి ఏంటి..?
X

విజయ్ సేతుపతి 50వ సినిమాగా నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహారాజ. ఫాదర్, డాటర్ ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్ లు కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ సూపర్ హిట్ కాగా ఓటీటీ రిలీజ్ అయ్యాక కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేసుకుంది. ఐతే ఈ సినిమాకు చైనా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా అక్కడ రీసెంట్ గా మహారాజ సినిమాను 40000 థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

ఇంత వైడ్ రేంజ్ లో రిలీజైన ఈ సినిమా కచ్చితంగా ఇదివరకు రిలీజైన అన్ని భారతీయ సినిమాల రికార్డులు కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ సినిమా కలెక్షన్స్ అంత దూకుడు కనిపించట్లేదు. సినిమాకు చైనాలో భారీ రిలీజ్ దొరికినా ఊహించినంత ఆక్యుపెన్సీ పొందట్లేదు. చైనా లో మహారాజ ఇప్పటివాకు 26.32 కోట్లను వసూలు చేసింది. మొదటి ప్రీమియర్స్ తో 5.41 కోట్లు రాబట్టగా.. రెండో రోజు 9.21 కోట్లు, 3వ రోజు 7.13 కోట్లు కలెక్ట్ చేసింది.

ఐతే ఈ సినిమా రిలీజ్ కు ముందు 200, 300 కోట్లు కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ 3 రోజుల్లో 30 కోట్లు కూడా దాటలేదు. మన దగ్గరలా సినిమా రెండు వారాల్లోనే తీసివేయరు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాల్సి ఉంది. చైనాలో భారీ యాక్షన్ సినిమాలు చూసే వారికి ఈ ఫాదర్, డాటర్ ఎమోషనల్ రైడ్ అంతగా ఎక్కే ఛాన్స్ లేదు. మహారాజ చైనాలో భారీ రిలీజ్ అనగానే చైనాలో ఇంతకుముందు రికార్డులు కొల్లగొట్టిన సినిమాలను బ్రేక్ చేస్తుందేమో అనుకుంటే అది జరిగే పనిలా కనిపించట్లేదు.

నిథిలన్ స్వామినాథన్ తో పాటు మహారాజ సినిమా కథనంలో విజయ్ సేతుపతి కూడా తన సలహాలు ఇచ్చినట్టు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఐతే మన దగ్గర సూపర్ హిట్ అయిన ఈ సినిమా చైనాలో మాత్రం ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేదు. అందుకే అంత భారీ సంఖ్యలో రిలీజ్ దొరికినా కూడా కలెక్షన్స్ రూపంలో మాత్రం అవి టర్న్ అవ్వలేదు. అంతేకాదు ఓటీటీలో ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి కూడా చైనాలో థియేట్రికల్ రిలీజ్ పూర్ రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు.