Begin typing your search above and press return to search.

చైనా లో మక్కల్ సెల్వన్ విధ్వంసం..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజ ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 7:30 AM GMT
చైనా లో మక్కల్ సెల్వన్ విధ్వంసం..!
X

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజ ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తమిళ్, తెలుగు భాషలో ఒకేసారి రిలీజై థియేట్రికల్ హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా భారీ వ్యూ కౌంట్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసి సినిమాను చైనాలో థియేట్రికల్ రిలీజ్ చేశారు. దాదాపు అక్కడ 40 వేల సెంటర్స్ లో మహారాజ రిలీజైంది. ఐతే అక్కడ కూడా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతేకాదు రిలీజైన ఫస్ట్ డే 16 కోట్ల దాకా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

మహారాజ సినిమాను నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేశారు. ఈమధ్య కాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమా లేదని చెప్పొచ్చు. చెత్త డబ్బా కోసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే ఒక త్రండ్రి ఆ చెత్త డబ్బా వెనక ఉన్న అసలు ట్విస్ట్ రివీల్ అయిన టైం లో ఆడియన్స్ హృదయాలను బరువెక్కేలా చేస్తారు. సినిమాలో విజయ్ సేతుపతితో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా అదరగొట్టాడు.

పెద్దగా అంచనాలు లేకుండా మినిమం ప్రమోషన్స్ తోనే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఇదే సినిమా చైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అక్కడ భారీగా రిలీజైన సినిమాల లిస్ట్ లో ఇది చేరగా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది. కంటెంట్ బాగుంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడేస్తుంది అని మహారాజ ప్రూవ్ చేస్తుంది.

విజయ్ సేతుపతి స్టోరీ సెలక్షన్ సత్తా ఏంటన్నది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమా టీజర్, ట్రైలర్ చూసిన వారు రెగ్యులర్ సినిమానేలే అనుకున్న వారికి సినిమా చూశాక తప్పకుండా అభిప్రాయం మారేలా చేశాడు దర్శకుడు. సినిమాలో విజయ్ నటన కూడా అదిరిపోతుంది. చైనా లో విజయ్ సేతుపతి మహారాజ బిగినింగ్ అదిరిపోయింది. మరి ఫుల్ రన్ లో అక్కడ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఈమధ్య సోలో సినిమాలు తగ్గించి ప్రతినాయకుడి పాత్రలు ఎక్కువ చేస్తున్న విజయ్ సేతుపతి మళ్లీ తన ఓన్ ట్రాక్ లోకి వచ్చేలా చేసిన సినిమా మహారాజ. అందుకే ఇక మీదట మెయిన్ లీడ్ తప్ప మిగతా ఎలాంటి పాత్రల్లో నటించకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.