Begin typing your search above and press return to search.

'మహారాజా' మేకర్‌కి ఖరీదైన బహుమానం

ఈ సందర్భంగా సినిమా దర్శకుడు నితిన్ స్వామినాథన్ కి నిర్మాతల నుంచి అత్యంత ఖరీదైన బహుమానం దక్కింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 6:46 AM GMT
మహారాజా మేకర్‌కి ఖరీదైన బహుమానం
X

విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో రూపొందిన మహారాజా సినిమా ఈ ఏడాది జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో వచ్చిన మేటి సినిమాల జాబితాలో టాప్‌ ప్లేస్ లో నిలిచింది. థియేటర్‌ రిలీజ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహారాజా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ రికార్డ్‌ సృష్టించింది. తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్‌ అయింది. నెట్‌ ఫ్లిక్స్‌ లో ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన ఇండియన్ మూవీస్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా మహారాజా నిలిచింది.

నెట్‌ ఫ్లిక్స్ లో సెన్షేషన్ క్రియేట్‌ చేయడంతో పాటు పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో సైతం ఈ సినిమా ప్రదర్శనకు ఆహ్వానం అందింది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా మహారాజా సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు నితిన్ స్వామినాథన్ కి నిర్మాతల నుంచి అత్యంత ఖరీదైన బహుమానం దక్కింది. తమ నిర్మాణ సంస్థకు గొప్ప సినిమాను ఇచ్చినందుకు గాను దర్శకుడు నితిన్ స్వామినాథన్ కి ఏకంగా బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమానంగా ఇవ్వడం జరిగింది. తమిళ మీడియా వర్గాల్లో ఆ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విజయ్ సేతుపతి కి బెంచ్ మార్క్ సినిమా అయిన 50వ సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి నటనకు జాతీయ అవార్డు వచ్చినా తక్కువే అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అలాంటి సినిమాను అందించిన దర్శకుడు నితిన్‌ స్వామినాథన్ కు మంచి గుర్తింపు గౌరవం లభించింది. కనుక ఆయనకు ఆ ఖరీదైన కారును బహుమానంగా ఇవ్వడం పెద్ద విషయం కాదని, ఆయన గొప్ప సినిమాకు, అద్భుతమైన సినిమాకు అది చిన్న బహుమానం అనే అభిప్రాయంను సినీ ప్రేమికులు, సోషల్‌ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.

మహారాజా సినిమా తర్వాత విజయ్‌ సేతుపతి క్రేజ్ మరింతగా పెరిగింది. ఇండియన్‌ సినిమాకు విజయ్‌ సేతుపతి ఒక అద్భుతమైన వరం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మరోసారి విజయ్ సేతుపతి తో నితిన్‌ స్వామినాథన్ సినిమా చేస్తూ చూడాలి అని కోరుకుంటున్నాం అంటున్నారు. మొత్తానికి వీరిద్దరి కాంబో మూవీ కోసం తమిళ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి అయిదు ఆరు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో రెండు షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నాయి.