Begin typing your search above and press return to search.

చైనాలో రిలీజ్ కి ముందే రికార్డు 40వేల స్క్రీన్ల‌లో!

నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ప్రేక్ష‌కుల‌కు సూపర్ థ్రిల్ను పంచింది.

By:  Tupaki Desk   |   20 Nov 2024 8:30 PM GMT
చైనాలో రిలీజ్ కి ముందే రికార్డు 40వేల స్క్రీన్ల‌లో!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'మహారాజా' ఓ మైలురాయిగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ప్రేక్ష‌కుల‌కు సూపర్ థ్రిల్ను పంచింది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన చిత్ర‌మిది. విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తెలుగు, త‌మిళ్ లో భారీ విజ‌యం సాధించిన చిత్ర‌మిది. తాజాగా ఈ సినిమా చైనా ను సైతం షేక్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఏకంగా అక్కడ 40 వేల స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది. దీంతో రిలీజ్ కి ముందే మ‌హారాజా చైనాలో రికార్డు సృష్టించింది. పాన్ ఇండియాలో భారీ విజ‌యాలు సాధించిన చిత్రాలు చైనాలో ఎక్కువ‌గా రిలీజ్ అవుతుంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాలు చైనాలో రిలీజ్ అయ్యాయి. కానీ 40వేల స్క్రీన్ల‌లో మాత్రం ఏ ఇండియ‌న్ సినిమా ఇంత వ‌ర‌కూ రిలీజ్ కాలేదు.

దీంతో `మ‌హారాజ` రిలీజ్ ఓ రికార్డుగా మారింది. యి షి ఫిల్మ్స్ - అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో `మహారాజా` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. మరి చైనా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి. మహారాజా మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం. పుల్ న‌ర్ లో దాదాపు రూ.107 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. సినిమాలో విలన్గా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ న‌టించాడు.

ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్క‌డా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇది ఓ రివేంజ్ స్టోరీ అయినా..డ‌బ్బు అనే అత్యాశ మ‌నిషిని ఎంత‌టి ప్ర‌మాదంలోకి నెడుతుంద‌న్న‌ది ఎంతో థ్రిల్లింగ్ గా చూపించారు. తండ్రి-కూతురు ప్రేమ‌ను ఎంతో హృద్యంగా చిత్రీక‌రించారు. స‌మాజానికి చ‌క్క‌ని సందేశాన్ని సైతం అందించిన చిత్ర‌మిది.