Begin typing your search above and press return to search.

అక్కడ 'బాహుబలి' దాటేసిన మహారాజ!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా సంచలన వసూళ్లు నమోదు చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:50 AM GMT
అక్కడ బాహుబలి దాటేసిన మహారాజ!
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా సంచలన వసూళ్లు నమోదు చేసుకుంది. ఇప్పటికీ ఆ వసూళ్లను బ్రేక్‌ చేయడం ఏ సినిమాకు సాధ్యం కావడం లేదు. ఆహా ఓహో అంటూ వచ్చిన పుష్ప 2 సినిమాకు సైతం ఆ వసూళ్ల వద్దకు చేరే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన బాహుబలి 2 చైనాలో మాత్రం చాలా తక్కువ వసూళ్లు నమోదు చేసింది. బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌ అనుసారం చైనాలో బాహుబలి 2 సినిమా కేవలం రూ.80 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు ఆ వసూళ్లను మహారాజ సినిమా బ్రేక్‌ చేసింది.

చైనాలో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకునే స్కోప్‌ ఉన్నా బాహుబలి 2 సినిమాకు అక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కని కారణంగా వసూళ్లు చాలా తక్కువ నమోదు అయ్యాయి. ఆ తర్వాత చాలా సినిమాలు చైనాలో విడుదల అయినా వాటికీ అదే పరిస్థితి. చైనాలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినా వచ్చిన రూ.80 కోట్లతో టాప్‌ 10 లో చోటు సంపాదించింది. ఇప్పుడు చైనాలో బాహుబలి ని విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజా సినిమా బ్రేక్ చేసింది. దాదాపు మూడు వారాల క్రితం చైనాలో విడుదల అయిన మహారాజా సినిమా మెల్లమెల్లగా వసూళ్ల వేట కొనసాగిస్తోంది.

మహారాజ సినిమా చైనాలో విడుదల అయ్యి 18 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు రూ.82 కోట్ల వసూళ్లను ఆ సినిమా దక్కించుకుంది. ఒక చిన్న సినిమా అది కూడా స్టార్‌ కాస్ట్‌ లేని సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం గొప్ప విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో ఒక థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన మహారాజ సినిమాకు ఇండియాలోనూ భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. విజయ్ సేతుపతి 50వ సినిమాగా రూపొందిన కారణంగా తమిళనాట భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. పాజిటివ్‌ టాక్ రావడంతో ఇతర భాషల్లో ఆధరణ పెరిగింది.

క్లైమాక్స్ ట్విస్ట్‌తో పాటు సినిమాలోని పలు అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అవే ఇప్పుడు చైనా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నట్లుగా ఉన్నాయి. అందుకే అక్కడ వంద కోట్లకు దగ్గరకు చేరింది. వచ్చే వీకెండ్‌ వరకు సినిమాకు వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఇంకా చాలా రన్‌ బ్యాలన్స్ ఉంది. కనుక చైనాలో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుని మహారాజ టాప్‌ లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌ మూవీ దంగల్‌ చైనాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెం.1 స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే.