చైనాలో మన 'మహారాజ' పరిస్థితి ఏంటి?
పాన్ ఇండియా రేంజ్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మహారాజ సినిమాను ఇప్పుడు చైనాలో విడుదల చేయడం జరిగింది.
By: Tupaki Desk | 30 Nov 2024 6:07 AM GMTపాన్ ఇండియా స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన 'మహారాజ' సినిమా ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమాగా రూపొందిన మహారాజ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట తమిళ్‌లో మాత్రమే విడుదల అయిన ఈ సినిమా తర్వాత అన్ని భాషల్లోనూ విడుదల అయ్యి ఏకంగా వంద కోట్ల వసూళ్లను నమోదు చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మహారాజ సినిమాను ఇప్పుడు చైనాలో విడుదల చేయడం జరిగింది.
రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, చైనాలో భారీ రిలీజ్ కావడంతో రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమిళ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహారాజ సినిమాకు చైనాలో ఏకంగా 40,000+ స్క్రీన్స్ లభించాయి. దాంతో మొదటి రోజే సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది అంటూ సమాచారం అందుతోంది. తాజాగా చైనాలో సందడి మొదలు పెట్టిన మహారాజా మొదటి రోజు రూ.15 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొదటి రోజు రూ.15 కోట్ల వసూళ్లు అంటే కచ్చితంగా భారీ మొత్తం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీకెండ్స్‌లో సినిమా కచ్చితంగా రెండు నుంచి నాలుగు రెట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి మూడు నాలుగు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు మెల్ల మెల్లగా ఆధరణ పెరిగితే అక్కడ నెల రోజుల పాటు స్క్రీనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఏ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుందో ఊహకు సైతం అందతు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
మహారాజ సినిమాకు చైనా సినీ రివ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ శాతం 10కి 7 నుంచి 8 రివ్యూ రేటింగ్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుందని ముందస్తుగానే అంచనా వేయడం జరిగింది. దంగల్ సినిమా చైనా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేయడం జరిగింది. ఇంకా పలు ఇండియన్ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం జరిగింది. కనుక మహారాజ సినిమా సైతం అక్కడ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. తండ్రి, కూతురు సెంటిమెంట్ కథతో మహారాజ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.