Begin typing your search above and press return to search.

విజయ్ 'మహారాజ'.. దూసుకెళ్తోందిగా!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 6:25 AM GMT
విజయ్ మహారాజ.. దూసుకెళ్తోందిగా!
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. రీసెంట్ గా ఆయన యాక్ట్ చేసిన మహారాజ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 14వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా.. పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజ మూవీ కాన్సెప్ట్ అదిరిపోయిందని చెబుతున్నారు.

ఫ్యామిలీతో థియేటర్లలో చూడదగ్గ మూవీ అని మౌత్ టాక్ రావడం.. సినిమాకు ప్లస్ పాయింట్‌ గా మారింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవల్ అని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్లలో రిలీజైన ఆ మూవీ.. అన్ని సెంటర్లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేశాయి.

ఈ సినిమాను చూసేందుకు మూవీ లవర్స్ మంచి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టికెట్ సెల్లింగ్ యాప్ బుక్ మై షోలో గత 24 గంటల్లో సుమారు రెండు లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. 1,99,340మంది సినిమా చూసేందుకు టికెట్లు కొనుగోలు చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మహారాజ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ గా నిథిలన్ తెరకెక్కించిన ఆ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అరుల్‍ దాస్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ తో పాటు మిగతా యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ కు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మించారు.

మరోవైపు, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‍ ఫ్లిక్స్.. థియేటర్లలో విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుని దక్కించుకుంది. దీంతో ఈ సినిమా వచ్చే నెల రెండో వారం లేకపోతే మూడో వారంలో స్ట్రీమింగ్‍ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అప్పటికీ థియేటర్ల మంచి వసూళ్లు రాబడుతుంటే.. స్ట్రీమింగ్ మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. మరి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాను మీరు చూశారా?