Begin typing your search above and press return to search.

మహరాజ.. మన హీరోలకు కనెక్ట్ చేస్తే..

కథ, రోల్ నచ్చితే చాలు హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అలా ఏ పాత్రలోనైనా నటించేస్తారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 3:15 AM GMT
మహరాజ.. మన హీరోలకు కనెక్ట్ చేస్తే..
X

కథ, రోల్ నచ్చితే చాలు హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అలా ఏ పాత్రలోనైనా నటించేస్తారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తన యాక్టింగ్ తో అదరగొట్టేస్తారు. వేరే లెవెల్ లో మెప్పిస్తారు. రీసెంట్ గా ఆయన నటించిన ల్యాండ్ మార్క్ మూవీ మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ మూవీ పాజటివ్ మౌత్ టాక్ తో తెలుగులో కూడా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

మహారాజ సినిమాలో విజయ్ సేతుపతి.. ఎప్పటిలానే తన నేచురల్ యాక్టింగ్ తో ఫిదా చేశారు. చెప్పాలంటే.. ఆయన యాక్టింగే మూవీకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ సైగలతో అమాయ‌కంగా కనిపించారు. ఆ తర్వాత తన కూతురికి అన్యాయం చేసిన వారి అంతం చూసేటప్పుడు మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. మొత్తంగా విజయ్ సేతుపతి.. కోలీవుడ్ తోపాటు తెలుగులో ఫ్యాన్స్ ను మరింత పెంచుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ ఇచ్చిన మేకర్స్.. సెకండాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఫస్టాఫ్ లో ఉన్న చిక్కులన్నీ ఒక్కొక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొయిన్ గా తన కూతురి విషయంలో హీరోకి జరిగిన నష్టం.. అందరినీ కంటతడి పెట్టించింది. తర్వాత పోలీసులు కూడా ఆయనతో కలవడంతో అదిరిపోయింది క్లైమాక్స్. దీంతో సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

అయితే చాలా మంది మూవీ చూశాక.. ఇలాంటి సినిమాలను టాలీవుడ్ హీరోలు ఎందుకు చేయరోనని చర్చించుకుంటున్నారు. మరికొందరు.. ఒకవేళ చేస్తే విజయ్ రోల్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని ఊహించుకుంటున్నారు. అనేక మంది మెగాస్టార్ చిరంజీవి.. ఆ పాత్రకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. ఆయన చేసి ఉంటే అనేక రికార్డులు బద్దలయ్యేవని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరికొందరు వెంకటేష్ కూడా బాగా సెట్ అవుతారని అంటున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ దృశ్యం మూవీని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఆ సినిమాలో వెంకీ తన యాక్షన్ తో వేరే లెవెల్ లో అలరించారు. దీంతో పాటు పలువురు యంగ్ హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మహారాజ డబ్బింగ్ వెర్షన్ మన దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. మేకర్స్ కు పెద్ద ఎత్తున లాభాలు కురిపిస్తోంది. ఇంకా ఫుల్ రన్ లో ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.