Begin typing your search above and press return to search.

రాజాలా అదరగొడుతున్న మహారాజ..!

కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ ఉన్నా సరే ఆడియన్స్ వాటిని వెతికి మరి పట్టుకుంటారు.

By:  Tupaki Desk   |   19 July 2024 5:47 AM GMT
రాజాలా అదరగొడుతున్న మహారాజ..!
X

కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ ఉన్నా సరే ఆడియన్స్ వాటిని వెతికి మరి పట్టుకుంటారు. అలాంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై హిట్ కొట్టినా డిజిటల్ రిలీజ్ లో కూడా అదే సక్సెస్ ని అందిస్తుంటారు. ఒక సినిమా అటు థియేటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇటు ఓటీటీలో కూడా సూపర్ సక్సెస్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి ఫీట్ ని చాలా తక్కువ సినిమాలు అందుకుంటాయి. ప్రస్తుతం అలాంటి సక్సెస్ ని అందుకుంది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ.

నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ సెకండ్ వీక్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. సినిమా కథ కథనాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. మహారాజ కథ చెప్పే విధానం దర్శకుడి ప్రతిభ తెలియచేస్తుంది. తెర మీద విజయ్ సేతుపతి యాక్టింగ్ తెర వెనుక డైరెక్టర్ టేకింగ్ రెండు సూపర్ గా వర్క్ అవుట్ అయ్యాయి. అందుకే సినిమా 100 కోట్లు కలెక్షన్స్ తో అదరగొట్టేసింది.

ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసి ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నారు. ఐతే మహారాజ మూవీ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సినిమా థియేటర్ లో చూసిన ఆడియన్స్ ఓటీటీలో కూడా చూస్తున్నారు. ఇక సినిమాను వెండితెర మీద చూడటం కుదరని వారు డిజిటల్ రిలీజ్ చూస్తున్నారు. సినిమా చూసి వారి రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సెక్షన్ లో మహారాజ టాప్ ఫోర్త్ లో నిలిచింది.

జూలై 8 నుంచి 14 వరకు నెట్ ఫ్లిక్స్ టాప్ సినిమాల లిస్ట్ లో 4వ ప్లేస్ దక్కించుకుంది మహారాజ. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మహారాజ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ ని టచ్ చేస్తుందని చెప్పొచ్చు. సినిమాను ఇలా కూడా తీయవచ్చా అనే కొత్త స్టోరీ టెల్లింగ్ ని డైరెక్టర్ నిథిలన్ చేసి చూపించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇంకా ఒక రేంజ్ లో దూసుకెళ్లేలా ఉందని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది మహారాజ.