ట్రైలర్ టాక్ : విజయ్ 'మహారాజా'లో ఆ లక్ష్మి ఎవరు?
ఇప్పుడు విజయ్.. సరికొత్త కథతో మహారాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 11 Jun 2024 3:22 PM GMTకోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన చిత్రాల్లో కొత్తదనం ఉండేలా ఎప్పుడూ చూసుకుంటారు. హీరో లేదా విలన్ రోల్ లోనైనా ఆయన నటిస్తే చాలు.. మూవీలో సాలిడ్ కంటెంట్ ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. విజయ్ సేతుపతి నటించే సినిమాలు.. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు విజయ్.. సరికొత్త కథతో మహారాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ లో పోలీస్ స్టేషన్ కు వచ్చిన విజయ్.. తన ఇంట్లో లక్ష్మి కనిపించడం లేదని, కేసు నమోదు చేయమని పోలీసులను కోరుతాడు. ఆ తర్వాత లక్ష్మి అంటే నగలు, పెట్టెలు, డ్యాకుమెంట్లు కాదని చెబుతాడు. భార్య కాదని, సోదరి కూడా కాదని అంటాడు. దీంతో ఆ లక్ష్మి ఎవరనే విషయంపై సస్పెన్స్ ఉంచారు మేకర్స్.
లక్ష్మిపై క్యూరియాసిటీ పెంచిన మేకర్స్.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 'లక్ష్మి మా ఇంటి దేవత సార్.. నా కూతురు ఊరి నుంచి వచ్చాక లక్ష్మి ఎక్కడ అని అడుగుతుంది. ఎలాగైనా వెతికిపెట్టండి సార్' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అతడు లంచం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సీబీఐకి కేసు అప్పగించాలని రిక్వెస్ట్ చేస్తాడు. అనంతరం అతడిని కొందరు చంపాలని చూస్తారు. చివర్లో లక్ష్మి సర్ అంటూ సైగలు చేసి చూపిస్తాడు విజయ్.
మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. సాల్ట్ అండ్ పెప్పర్ రోల్ లో విజయ్ సేతుపతి ఆద్యంతం అలరించారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో అదరగొట్టారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మహారాజా కొత్త కాన్సెప్ట్ తో డిఫరెంట్ యాక్షన్ మూవీ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
విజయ్ సేతుపతి మైల్ స్టోన్ 50వ చిత్రమైన మహారాజా.. జూన్ 14న తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి గ్రాండ్ గా విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించగా.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఎన్ వీఆర్ సినిమాస్ విడుదల చేయనుంది. మమతా మోహన్ దాస్, నట్టి, భారతీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.