మహరాష్ట్ర రూరల్ మొత్తం పుష్ప రాజ్ బ్లాక్ చేసేసాడా?
ముఖ్యంగా మహారాష్ట్ర వ్యప్తంగా ఉన్న రూరల్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
By: Tupaki Desk | 10 Nov 2024 7:48 AM GMT'పుష్ప' నార్త్ ఇండియాని ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఊహించని వసూళ్లను నార్త్ మార్కెట్ నుంచే రాబట్టింది. సరిగ్గా లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. దీంతో హిందీ ప్రేక్షకులు థియేటర్ కి వస్తారా? రారా? అన్న సందిగ్దం ఉంది. కానీ అన్నింటిని పటాపంచల్ చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర వ్యప్తంగా ఉన్న రూరల్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అంతవరకూ ఏ తెలుగు సినిమా సింగిల్ స్క్రీన్ల నుంచి ఆ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేదు. అది చూసి అక్కడ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లే షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో 'పుష్ప-2' కోసం మహారాష్ట్ర రూరల్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లంటినీ ముందుగానే బ్లాక్ చేసి పెట్టారుట. ఒక్క థియేటర్ కూడా మిస్ అవ్వకుండా ప్రతీ థియేటర్ లో 'పుష్ప -2' ఆడేలా అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ వేసి ముందుకెళ్తున్నారుట.
ఈ సినిమాకి ఆయన నిర్మాత కాదు. మైత్రీ మూవీ మేకర్స్ అయినా? కుమారుడు బన్నీ కోసం అరవింద్ రంగంలోకి దిగి థియేటర్లను సర్దుబాటు చేయడంలో కీలక పాత్ర పోషించారుట. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పుష్ప లాంగ్ రన్ చూసి ఇలా ప్లానేసి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీలో అరవింద్ మాస్టర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ప్లానింగ్ దెబ్బకి` ఛావా` సైతం వాయిదా పడుతుందని అంటున్నారు.
విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమాకి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూరల్ ఏరియాల్లో సింగిల్ స్క్రీన్లు దొరకలేదుట. చేతిలో మల్టీప్లెక్స్ లు ఉన్నప్పటికీ తక్కువ మొత్తంలోనే సింగిల్ స్క్రీన్ దొరకడంతో తమ చిత్రాన్ని జనవరికి వాయిదా వేసుకోవాలనుకుంటున్నారుట. దీనికి సంబంధించి హిందీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనా రానుందని సమాచారం.