Begin typing your search above and press return to search.

మెగాక్యాంప్ లో 100వ‌సారి ర‌క్త‌దానం చేసిన న‌టుడు!

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 99 సార్లు ర‌క్తం దానం చేయ‌గా తాజాగా 100వ సారి చేసిన‌ప్పుడు చిరంజీవి సైతం వ‌స్తాన‌ని అప్ప‌ట్లో ప్రామిస్ చేసారు.

By:  Tupaki Desk   |   18 April 2024 7:16 AM GMT
మెగాక్యాంప్ లో 100వ‌సారి ర‌క్త‌దానం చేసిన న‌టుడు!
X

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన బ్ల‌డ్ బ్యాంక్ ఎంతో మంది అవ‌స‌రాలు తీరుస్తోన్న సంగ‌తి తెలిసిందే. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ర‌క్తం కావాలంటే? గుర్తొచ్చేది మెగాబ్ల‌డ్ బ్యాంక్. నిత్యం అక్క‌డ ర‌క్త‌దాత‌లతో క్యాంప్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఇక మెగా హీరోల పుట్టిన‌రోజులు వ‌స్తే! అభిమానులు భారీ ఎత్తున ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి సేక‌రిస్తుంటారు. కొన్నేళ్ల‌గా ఎంతో గొప్ప మ‌హాత్త‌ర కార్య‌క్ర‌మంగా జ‌రుగుతుంది. తాజాగా 100వ సారి ర‌క్తదానం చేసి బ్ల‌డ్ బ్యాక్ చ‌రిత్ర‌లో న‌లిచిపోయారు న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 99 సార్లు ర‌క్తం దానం చేయ‌గా తాజాగా 100వ సారి చేసిన‌ప్పుడు చిరంజీవి సైతం వ‌స్తాన‌ని అప్ప‌ట్లో ప్రామిస్ చేసారు. ఈ మ‌ధ్య‌నే 100వ సారి కూడా ర‌క్తం ఇవ్వ‌డం జ‌రిగింది. కానీ చిరంజీవి అనివార్య కార‌ణాల‌తో ఆరోజు రాలేక‌పోయారు. ఈనేప‌థ్యంలో తాజాగా చిరంజీవి...మ‌హ‌ర్షి రాఘ‌వ‌ని ఇంటికి పిలిపించి స‌న్మానించారు. ఆయ‌న‌తో పాటు న‌టుడు ముర‌ళీ మోహ‌న్ కూడా చిరంజీవి ఇంటికొచ్చి రాఘ‌వ‌ని అభినందించారు.

వందసార్లు రక్త దానం చేయడం చాలా గొప్ప విషయమని రాఘవను మెచ్చుకున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేస్తూ రావడం మామూలు విషయం కాదంటూ రాఘవ సేవాగుణాన్ని కొనియాడారు. మహర్షి రాఘవతో పాటు ఆయన భార్య శిల్ప కూడా పాల్గొన్నారు. 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ప్రారంభించారు. అప్ప‌టి నుంచి అక్క‌డ నిత్యం రక్త సేక‌ర‌ణ కార్య్ర‌మాలు నిర్విరామంగా జ‌రుగుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజు నాడు అయితే దేశ వ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

అందులో పెద్ద ఎత్తున అభిమాన‌లు పాల్గొని రక్తం దానం చేస్తుంటారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటుంది. చిరంజీవి త‌ర్వాత త‌రం న‌టులు కూడా అందుబాటులోకి రావ‌డంతో బ్ల‌డ్ బ్యాంక్ కార్య‌క్ర‌మ‌లు మ‌రింత వేగంగా జ‌రుగుతున్నాయి. మెగా హీరోలు కూడా పుట్టిన రోజు నాడు ఏటా ర‌క్త‌దానం చేసి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నారు.