Begin typing your search above and press return to search.

భైరవ వచ్చే వరకు మహారాజా జోరు..!

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు, మూడో రోజు అత్యధిక వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2024 9:30 AM GMT
భైరవ వచ్చే వరకు మహారాజా జోరు..!
X

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు, మూడో రోజు అత్యధిక వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.

మొదటి వారం పూర్తి చేసుకున్న మహారాజా సినిమా తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్ తో అనుకున్న దాని కంటే ఎక్కువగానే వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వసూళ్ల సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

గత వారం వచ్చిన సినిమాలతో పోటీ పడి నిలిచిన మహారాజా సినిమాతో పోల్చితే ఈ వారం విడుదల అయిన సినిమాలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అద్భుతం జరిగితే తప్ప ఈ వారం విడుదల అయిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు.

కనుక ఈ వారం రోజులు కూడా మహారాజా సినిమా కే మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 27వ తారీకున ప్రభాస్‌ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్‌ భైరవగా నటించిన కల్కి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కనుక భైరవ వచ్చే వరకు మహారాజా సినిమా సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మహారాజా కనిపించే అవకాశాలు ఉండవు. కనుక మహారాజా గా విజయ్ సేతుపతి ఈ అయిదు రోజుల పాటు ఎంత వరకు వీలు అయితే అంత వసూళ్లు చేసుకోవాల్సి ఉంటుంది.

కల్కి సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఆ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మహారాజా సినిమా అప్పటి వరకు బరిలో ఉండే అవకాశం లేదు. కనుక ప్రభాస్ రాక ముందే బాక్సాఫీస్ వద్ద సాధ్యం అయినంత సర్దేసుకోవాలని మేకర్స్ కూడా భావిస్తున్నారట.