2027లోనే ఐకాన్ స్టార్...సూపర్ స్టార్!
అందుకోసం కనీసం ఆరు నెలలకు పైగా సమయం తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా.
By: Tupaki Desk | 1 Jan 2025 6:27 AM GMTసూపర్ స్టార్ మహేష్ ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యేదెప్పుడు? 2025 సాధ్యం కాదన్నది పక్కా? అందులో ఎలాంటి డౌట్ లేదు. రెండు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి చుట్టేసి రిలీజ్ చేసే చిత్రాలు కాదు. మరి ఈ సినిమాలకు రిలీజ్ మోక్షం ఎప్పుడు ఉంటుందంటే? 2026 ముగింపు లేదా 2027 వరకూ ఆ రెండు చిత్రాల గురించి ప్రేక్షకాభిమానులు ఆలోచించడం అనవసరమే. మహేష్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని రాజమౌళి జూన్ తర్వాత పట్టాలెక్కిస్తారని సమాచారం. వాస్తవానికి జనవరిలోనే ప్రారంభించాలనుకున్నారు.
కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు డిలే అవ్వడంతో? జూన్ కి వాయిదా పడినట్లు వినిపిస్తుంది. మార్చిలో ఓ తేదీ అనుకు న్నప్పటికీ అప్పటికీ కంప్లీట్ గా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయడం కష్టమని భావించి సమ్మర్ తర్వాతే ఫిక్స్ అయినట్లు సన్నిహితుల సమాచారం. అలాగే రాజమౌళి ఆ చిత్రాన్ని ఎలా లేదన్నా? ఏడాదిన్నర పాటు షూటింగ్ చేస్తారు. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం తీసుకుంటారు. అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి టెక్నికల్ వర్క్ కూడా భారీగానే ఉంటుంది.
అందుకోసం కనీసం ఆరు నెలలకు పైగా సమయం తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా. అలాగైతే చిత్రం 2027 లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. మైథలాజికల్ టచ్ తో తీస్తున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ కోసమే 15 నెలలు సమయం కేటాయించారు. రఫ్ గా చిత్రీకరణకు అంత సమయం పడుతుందని భావిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమా కాబట్టి 15 నెలలకు మించే పడుతుంది తప్ప షూటింగ్ డేస్ తగ్గడానికి ఛాన్స్ లేదు. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువగా సమయం పడుతుంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసి చూస్తే? ఈ చిత్రాన్ని 2026 ఏడాది ముగింపు లేదా? 2027 ప్రధమార్ధంలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అదీ మహేష్ సినిమాతో క్లాష్ కాకుండా రిలీజ్ చేయాలి. కాబట్టి రిలీజ్ తప్పని సరిగా రెండు సినిమాల మధ్యా నెల రోజులు వ్యత్యాసం ఉంటుంది. అప్పటి వరకూ మహేష్..బన్నీ అభిమానులు ఎదురు చూడాల్సిందే.