Begin typing your search above and press return to search.

మహేష్ కోసం రక్తం వచ్చేలా.. ఇదేమి పిచ్చి సామీ..

ఒక సారి హీరోని అభిమానించడం మొదలు పెడితే అతని కోసం ఓ వర్గం ఫ్యాన్స్ ఏం చేయడానికి అయిన రెడీ అయిపోతారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:02 AM GMT
మహేష్ కోసం రక్తం వచ్చేలా.. ఇదేమి పిచ్చి సామీ..
X

ఇతర భాషలలో హీరోల కంటే టాలీవుడ్ స్టార్స్ కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక సారి హీరోని అభిమానించడం మొదలు పెడితే అతని కోసం ఓ వర్గం ఫ్యాన్స్ ఏం చేయడానికి అయిన రెడీ అయిపోతారు. అంతలా హీరోలని ఆరాధిస్తూ ఉంటారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ని తెలుగు రాష్ట్రాలలో దేవుడిగా ఆరాధిస్తూ ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది.

అలాగే తెలుగులో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఫ్యాన్స్ ఆయనని విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. మహేష్ ని కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఇష్టపడతారు. దానికి కారణం ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఎంతో మంది పేద పిల్లలని చదివించడమే కాకుండా హార్ట్ ఆపరేషన్స్ కూడా తన సొంత సంపాదనతో చేయిస్తున్నాడు.

పేద కుటుంబాల వారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత నడుపుతున్న ఎన్జీవో ని సంప్రదిస్తే కచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో సాయం అందుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మహేష్ బాబు 3500 మంది చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. దీని గురించి మహేష్ బాబు అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటారు. చేసిన సాయాన్ని మహేష్ బాబు ఎప్పుడు ప్రచారం చేసుకోరని కొనియాడుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని పబ్లిక్ గా చేతిని కోసుకొని రక్తంతో మహేష్ బాబు కటౌట్ కి బొట్టు పెట్టాడు. అక్కడ కొందరు అభిమానిని నిలువరించే ప్రయత్నం చేసిన కూడా అతను ఆగలేదు. ఈ వీడియోకి ఒక అభిమాని ట్విట్టర్ లో పెట్టి వేరొక హీరో ఫ్యాన్స్ కి ఛాలెంజ్ చేస్తూ ట్వీట్ చేశారు. నిజానికి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏ హీరో కూడా ఎంకరేజ్ చేయడు. నిజంగా అంత ప్రేమ ఉంటే రక్తదానం చేయండి. ఎవరో ఒకరి ప్రాణాలు నిలబడతాయి. ఇలా కోసుకుంటే వాడి ప్రాణాలు పోతాయి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు అయితే ఇలా రక్తం కోసుకొని బొట్లు పెట్టడం చేస్తే అస్సలు ఇష్టపడడు. గతంలో ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని తగ్గించుకొని మారాలని మహేష్ బాబు చెప్పాడు. హీరోల మీద అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ ఇలాంటి పనులు హీరోలకి బ్యాడ్ ఇమేజ్ తీసుకొని వస్తాయి. అందుకే స్టార్ హీరోలు ఎవ్వరు కూడా వీటిని ఎంకరేజ్ చేయరు. నిజంగా అభిమానం ఉంటే మహేష్ బాబు తరహాలోనే సోషల్ సర్వీస్ చేస్తూ దానిని చూపించాలని ఈ వీడియో క్రింద కామెంట్స్ వస్తున్నాయి.