మహేష్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో కామెడీ చేస్తున్న మేకర్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు.
By: Tupaki Desk | 14 March 2025 1:28 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు. మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో భరత్ అనే నేను కూడా ఒకటి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకీ, హోళీ పండక్కి ఓ చిన్న సంబంధముంది. ఈ సినిమాలో అప్పట్లో హోళీ ఫైట్ సీన్స్ ను చేసి దాన్ని డిలీట్ చేశారు. ఇప్పటివరకు ఆ సీన్ ను మేకర్స్ బయటకు వదిలింది లేదు. ఈ హోళీ ఫైట్ సీన్ ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ అందరూ మొన్నా మధ్య డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ మాత్రం రిలీజ్ చేయలేదు.
అయితే ఇవాళ హోళీ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు. మరో హోళీ పండుగను కూడా భరత్ అనే నేను మూవీ హోళీ ఫైట్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ తమ ఎమోషన్స్ తో నిర్మాతలు కామెడీ చేస్తున్నారని ఫీలవుతున్నారు.
ఎప్పటికైనా ఈ హోళీ ఫైట్ సీన్ ను నిర్మాతలు రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సీఎం భరత్ గా రాష్ట్రాన్ని ఎలా బాగుచేయొచ్చనేది ఎంతో గొప్పగా చూపించారు. ఈ సినిమాలోని ప్రెస్ మీట్ సీన్ అప్పట్లో బాగా సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళితో తన 29వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.