మహేష్ బాబు.. అదిరిపోయే లుక్ లో..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. దివంగత కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 22 Dec 2024 10:25 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. దివంగత కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా తన చిత్రాలతో మెప్పిస్తున్నారు. హీరోగా ఇప్పటి వరకు 28 సినిమాలు చేశారు.
అయితే ఇప్పుడు SSMB 29 ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో తన కొత్త మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అనౌన్స్మెంట్ తప్ప మరో అప్డేట్ ఇప్పటి వరకు రాకపోగా.. నెట్టింట రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని.. రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం సాగుతోంది. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించనుందని టాక్ వినిపిస్తోంది. కొందరు ఫారిన్ యాక్టర్స్ ను రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది. అన్ని వివరాలను త్వరలో ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న, మహేష్ అనౌన్స్ చేయనున్నారని టాక్.
అయితే SSMB 29 మూవీ రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఇంతలో ముఫాసా మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ కు సీక్వెల్ గా వచ్చిన ముఫాసాలో మహేష్ వాయిస్ ను థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో WOW అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీ వైరల్ గా మారింది. యూనివర్సరీ ఎడిషన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చారు మహేష్ బాబు. బ్లూ జీన్స్, బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్న మహేష్.. హ్యాండ్సమ్ హంక్ గా కనిపిస్తున్నారనే చెప్పాలి.
లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న మహేష్.. రిఫ్రెషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే WOW నిర్వాహకులు.. మ్యాగజైన్ కవర్ పేజీని షేర్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. మహేష్.. టాలీవుడ్ గోల్డెన్ స్టాండర్డ్ అంటూ రైటప్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ లుక్ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు. ఎంతైనా మహేష్ అందమే వేరని అంటున్నారు.