బుల్లి రాజు కోసం మహేష్ మరోసారి!
మహేష్ ...వెంకీ ముందు తన కోరిక చెప్పడంతో దర్శకుడు అనీల్ రావిపూడి వెంటనే బుల్లి రాజుని మహేష్ ముందు ఉంచారు.
By: Tupaki Desk | 19 Jan 2025 8:00 AM GMTసంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం ఎంత పెద్ద సక్సస్ సాధించిందో తెలిసిందే. విజయంలో `డాకు మహారాజ్` నే మించి పోయింది. ఈ రెండు సినిమాల మధ్యలో `గేమ్ ఛేంజర్` ఉన్నా ఆశించిన ఫలితాలు ఆ సినిమాకు రాలేదు. దీంతో సంక్రాంతి విన్నర్ ఎవరు? అంటే `సంక్రాంతికి వస్తున్నాం` ముందు ప్లేస్ లో ఉంటే తర్వాత స్థానంలో డాకు మహారాజ్ నిలిచింది. వెంకేటష్ హీరోగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి సినిమా పర్పెక్ట్ సంక్రాంతిని ప్రేక్షకులకు అందించింది.
సినిమా రిలీజ్ అయి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ థియేటర్లు హౌస్ పుల్ అవుతున్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజ్ సంతోషంగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నేపథ్యం లో విక్టరీ వెంకటేష్ తో కలిసి మహేష్ బాబు ఈ సంక్రాంతిని వాళ్ల ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ అలియాస్ బుల్లిరాజుని చూడాలనుకోవడం...మాట్లాడాలనుకోవడం మరో విశేషం.
మహేష్ ...వెంకీ ముందు తన కోరిక చెప్పడంతో దర్శకుడు అనీల్ రావిపూడి వెంటనే బుల్లి రాజుని మహేష్ ముందు ఉంచారు. దీంతో మహేష్ రేవంత్ నటన మెచ్చుకుని తన కోసం మరోసారి సినిమా చూస్తానని చెప్పారట. మహేష్ లాంటి స్టార్ హీరో రెండవ సారి సినిమా చూడటం అంటే చిన్న విషయం కాదు. అతడికి ఎంతో నచ్చితే తప్ప ఇతర హీరోల సినిమాలు చూడరు. అలాంటి మహేష్ బుల్లి రాజు కోసం రెండవ సారి సినిమా చూడటం అన్నది బుల్లి రాజు ప్రత్యేకతగానే చెప్పాలి.
ఇండస్ట్రీలో మహేష్ క్లోజ్ గా మూవ్ అయ్యే హీరో వెంకటేష్. వెంకీని బాగా అభిమానించే స్టార్ కూడా అతడే. ఇద్దరు కలిసి `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమా చేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మల్టీస్టారర్ కి నాంది పలింది ఈ ఇద్దరు హీరోలే. అప్పటి నుంచి వాళ్ల ప్రెండ్ షిప్ మరింత స్ట్రాంగ్ అయింది.