Begin typing your search above and press return to search.

మహేష్, జక్కన్న మూవీ.. ఎందుకంత సైలెంట్?

సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నా.. మరెన్నో రూమర్లు వినిపిస్తున్నా.. జక్కన్న సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 6:10 AM GMT
మహేష్, జక్కన్న మూవీ.. ఎందుకంత సైలెంట్?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్డ్ అవైటెడ్ మూవీ SSMB 29 రీసెంట్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా సినిమాను ప్రారంభించారు మేకర్స్.

సాధారణంగా.. మహేష్ తన సినిమాల పూజా కార్యక్రమాలకు అటెండ్ కారు. కానీ ఈసారి ఆయన సమక్షంలోనే జరిగాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ కావడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులంతా SSMB 29 కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంలో సాగే కథతో సినిమా తెరకెక్కుతోందట.

అయితే మూవీ స్టోరీ లైన్ తప్ప సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నిన్న లాంఛింగ్ ఈవెంట్.. కూడా మీడియాకు దూరంగా జరిగింది. ఎలాంటి ఫోటోస్ గానీ వీడియోస్ గానీ మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతారని టాక్ వినిపించినా.. అది ఇంకా జరగలేదు.

అయితే స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగ్గా.. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఆ సమయంలో యాంకర్.. మహేష్ తో చేస్తున్న మూవీ కోసం అడగ్గా తర్వాత చెబుతానని ప్రశ్నను దాటి వేశారు రాజమౌళి. చరణ్ మాత్రం.. కొవిడ్ ఏం లేకపోతే ఏడాదిన్నరలో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు.

దీంతో ఇప్పుడు రాజమౌళి.. SSMB 29 ప్రాజెక్టుపై ఎందుకు అంత సైలెంట్ ఉన్నారోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నా.. మరెన్నో రూమర్లు వినిపిస్తున్నా.. జక్కన్న సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సినిమాను స్టార్ట్ కూడా చేసేశారు.

ఇలా రాజమౌళి సినిమాలకు మాత్రమే జరుగుతుంటాయి. మొత్తానికి జక్కన్న నుంచి రాబోయే అప్డేట్ కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులు.. ఎంతో వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి. అయితే ఆ సినిమాకు విజయేంద్రప్రసాద్‌ కథను అందించగా.. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.