Begin typing your search above and press return to search.

SSMB29: మహేష్ రెమ్యునరేషన్ జీరో?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనున్న ‘SSMB29’ ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Jan 2025 5:59 AM GMT
SSMB29: మహేష్ రెమ్యునరేషన్ జీరో?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనున్న ‘SSMB29’ ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేసిన జక్కన్న రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసేశారు.

సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని జక్కన్న సిద్ధం చేయబోతున్నారంట. ప్రొడక్షన్ లోకి వెళ్లిన తర్వాత ఇంకా బడ్జెట్ పెరగొచ్చని భావిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగం కాబోతోందని సమాచారం.

అయితే అదెవరు అనేది తెలియాల్సి ఉంది. సినిమాని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళడానికి జక్కన్న వారిని రంగంలోకి దించారని అనుకుంటున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబుకి ఎంత రెమ్యునరేషన్ అయిన ఇవ్వడానికి అయిన నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు పార్ట్స్ కూడా అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నారంట.

1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ బదులు లాభాల్లో వాటా తీసుకుంటానని మహేష్ బాబు చెప్పారని సమాచారం. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నారు. లాభాల్లో 25 శాతం వాటిని మహేష్ బాబు, రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారన టాక్. దీంతో వీరి రెమ్యునరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారు.

ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ కూడా ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా ఇండియన్ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయ్యిందంట. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. భారీ పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.

వరల్డ్ వైడ్ గా వీలైనన్ని ఎక్కువ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారంట. ఇక ‘SSMB29’ మొదటి పార్ట్ 2027లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక రెండో భాగం 2029లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సినిమ అఫీషియల్ ప్రారంభోత్సవం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే మూవీలో లీడ్ పాత్రలలో ఎవరు నటించబోతున్నారు తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో చూస్తున్నారు.