Begin typing your search above and press return to search.

'దేవ‌ర' విష‌యంలో మ‌హేష్ మౌనం!

టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజ్ అయితే సూప‌ర్ స్టార్ మ‌హేష్ చిన్న పాటి రివ్యూ ఇస్తారు? అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 7:23 AM GMT
దేవ‌ర విష‌యంలో మ‌హేష్ మౌనం!
X

టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజ్ అయితే సూప‌ర్ స్టార్ మ‌హేష్ చిన్న పాటి రివ్యూ ఇస్తారు? అన్న సంగ‌తి తెలిసిందే. హిట్ సినిమాల విష‌యంలో త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా పంచుకుంటారు. చిత్ర యూనిట‌క్ కి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తుంటారు. స్టార్ సినిమాల‌నే కాదు చిన్న సినిమాలు ఏవి మంచి విజ‌యం సాధించిన ఒపినియ‌న్ పంచుకుని విషెస్ చెబుతుంటారు.

ఈనెల ఆరంభంలో విడుద‌లైన `మ‌త్తువ‌ద‌లారా-2` విష‌యంలో త‌న రివ్యూ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ అనంత‌రం ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ త‌దుప‌రి రివ్యూ ఇచ్చేది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర‌`పైనే అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వ‌స్తోంది.

కానీ వ‌సూళ్ల సునామీ మాత్రం కొన‌సాగిస్తుంది. ఇప్ప‌టికే 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఈ సినిమా విష‌యంలో మ‌హేష్ ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. మ‌రి ఆయ‌న సినిమా చూసారా? లేదా? అన్న‌ది తెలియ‌దు. ఒక‌వేళ చూసి సైలెంట్ గా ఉన్నారా? అన్న‌ది క్లారిటీ లేని అంశం. ప్ర‌స్తుతం మ‌హేష్ విదేశాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే ద‌ర్శ‌కుడు కొరటాల శివ‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో మ‌హేష్ కి మంచి అనుబంధం ఉంది. కొర‌టాల గ‌తంలో మ‌హేష్ కి `శ్రీమంతుడు`, `భ‌ర‌త్ అనే నేను` లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చారు. దీంతో కొర‌టాల సైతం మ‌హేష్ అభిమాన ద‌ర్శ‌కుల జాబితాలో చేరారు. ఇక ఎన్టీఆర్ ..మ‌హేష్ అని ఎంతో అభిమానంతో `అన్నా` అని పిలుస్తారు. మంచి స్నేహితులు కూడా . ఎన్టీఆర్ అంటే ఎంతో స‌ర‌దాగా ఉంటాడ‌ని మ‌హేష్ అంటారు. మ‌రి అలాంటి స్నేహితుల మ‌ధ్య మ‌హేష్ మాట ఎక్క‌డ అంటున్నారు.