పిక్‌టాక్ : ఏడు ఏళ్ల క్రితం మహేష్, సీతూపాప
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ కిడ్ సితార ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంటాయి. సితార చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది
By: Tupaki Desk | 17 Dec 2024 7:57 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ కిడ్ సితార ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంటాయి. సితార చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో అయినా, తండ్రితో పర్సనల్ టూర్‌ల్లో అయినా సితార ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించేవి అనడంలో సందేహం లేదు. అలాంటి సితార ఇప్పుడు పెద్ద పాప అయ్యింది. పెద్ద అయ్యాక తన ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. తన తండ్రికి సంబంధించిన సినిమాలను అప్పుడప్పుడు ప్రమోట్ చేయడం ద్వారా సితార వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఒక పాత ఫోటోతో సితార తండ్రితో కలిసి వార్తల్లో నిలిచింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తాజాగా ఎక్స్‌లో మహేష్‌బాబు, సితారల యొక్క పాత ఫోటోను షేర్ చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తీసిన ఫోటోగా తెలుస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలో సితార ను చూస్తూ ఉంటే ముద్దు వస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంత క్యూట్‌గా ఉందో అంటూ సీతూ పాప గురించి పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ తండ్రితో ఉంటూ ముసిముసి నవ్వులతో చుట్టుపక్కల వాతావరణంను ఆహ్లాదకరంగా మార్చే సితార ను ఈ ఫోటోలో చూసి అప్పుడే సీతూ పాప ఎంత పెద్దది అయ్యిందని అంటున్నారు.
ఎన్నో సూపర్ హిట్, సెన్షేషనల్ మూవీస్‌కి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన సంతోష్ శివన్ ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన మహేష్ బాబు స్పైడర్ సినిమాకు వర్క్ చేశాడు. ఆ సమయంలో మహేష్ బాబు, సితారలను ఆన్ లొకేషన్ లేదా మరేదైనా సంద్భంలో సంతోష్ శివన్ ఈ ఫోటో తీసి ఉంటాడు. ఇప్పుడు ఆ ఫోటో తనకు కనిపించడంతో సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటాడు. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్‌ను మెప్పించే విధంగా సితారతో ఉన్న మహేష్ బాబు ఫోటోను షేర్ చేయడం ద్వారా సంతోష్ శివన్ వార్తల్లో నిలిచాడు. ఆయనకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని మెమోరబుల్ ఫోటోలను షేర్ చేయాలని కోరుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే త్వరలోనే రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో వచ్చిన మహేష్ బాబు గత ఏడాది కాలంగా గడ్డం, జుట్టు పెంచుకుని ఖాళీగానే ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఆయన రాజమౌళి సినిమా యొక్క స్క్రిప్ట్ చర్చల్లో, వర్క్ షాప్‌లోనూ పాల్గొన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమాను మొదలు పెడితే పాన్ వరల్డ్ స్థాయిలో 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి సినిమా ఈసారి హద్దులు దాటి విదేశాల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.