రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ చూశారా?
షెడ్యూల్ పూర్తైన తర్వాత సెట్స్ లో దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 19 March 2025 1:56 PM ISTఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. SSMB29 మంగళవారం ఒడిశాలోని కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
షెడ్యూల్ పూర్తైన తర్వాత సెట్స్ లో దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. సినిమా సెట్స్ నుంచి వచ్చిన ఈ ఫోటోల్లో మహేష్ లుక్ అందరినీ తెగ ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చి అనఫీషియల్ ఫస్ట్ లుక్ ఇదే. ఈ ఫోటోల్లో మహేష్ గడ్డం, లాంగ్ హెయిర్ తో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
మహేష్ లుక్ చూస్తుంటే ఆయన ఎస్ఎస్ఎంబీ29 కోసం చాలా మేకోవర్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి రాజమౌళి ప్రతీ సినిమా మొదలుపెట్టే ముందు ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇప్పటివరకు ఏ చిన్న విషయాన్నీ బయటకు చెప్పింది లేదు.
కావాలనే రాజమౌళి ఈ సినిమా గురించి దేన్నీ బయటపెట్టకుండా ఉంటున్నాడనిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ ను రాజమౌళి ఎలా చూపించనున్నాడనే అంశం అందరినీ తెగ ఎగ్జయిట్ చేస్తోంది. ఇప్పుడు సెట్స్ నుంచి వచ్చిన లుక్ చూశాక అందరికీ కొంత క్లారిటీ వచ్చింది. అలా అని ఈ ఫోటోలో కనిపించినట్టే మహేష్ సినిమాలో ఉంటాడునుకోవడానికి లేదు. రాజమౌళి ప్రతీ విషయంలో మైండ్ గేమ్ ఆడతాడు కాబట్టి ఈ విషయంలో కూడా మహేష్ లుక్ వెనుక ఏదో ఉండే ఉంటుంది. సినిమాలో మహేష్ లుక్ ఇదే అయితే అతన్ని రాజమౌళి ఇలా ఓపెన్ గా ఫోటోలు కూడా దిగనివ్వడు. కాబట్టి మహేష్ లుక్ విషయంలో జక్కన్న ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే ఎస్ఎస్ఎంబీ29 సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను సూర్తి చేసుకుంది. షూటింగ్ కు ఎలాంటి ఆటంకం రాకుండా రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే షెడ్యూల్స్ ను కూడా ఇలానే ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకుని ఎప్పటిలా కాకుండా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట జక్కన్న.