రాజమౌళికి తెలిసే ఈ లీకులు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 March 2025 9:08 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మహేష్- రాజమౌళి టీమ్ ప్రధాన షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒడిస్సాలోని అడవుల్లో షూటింగ్ సాగుతోంది. అయితే షూటింగ్ స్పాట్ లో మహేష్ తన అభిమానులతో కలిసి ఫోటోలకు సహకరించడం, ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవ్వడంతో ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి.
వాస్తవంగా బాహుబలి సమయంలో ప్రభాస్, రానా కానీ.. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, చరణ్ కానీ ఇలాంటి లీకులు ఇవ్వలేదు. వారు తమ పాత్రకు సంబంధించిన లుక్స్ ని దాచి ఉంచడంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. సెట్స్ లో ఫోన్లకు కూడా అనుమతి లేదు. ఎవరూ ఫోటోలు కూడా తీసుకోవడానికి ఛాన్సే లేదు. దీంతో ఎలాంటి లీకులకు ఆస్కార లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి సినిమాకి సంబంధించిన చాలా విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి.
ఇంతకుముందు మహేష్ లుక్ ఎలా ఉంటుందో రివీలైపోయింది. సెట్స్ నుంచి మహేష్ లీక్డ్ ఫోటో ఇంటర్నెట్ లో షికార్లు చేసింది. ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ లో మరో లీక్. చిత్రీకరణ ముగించాక మహేష్ స్థానికులతో ఫోటోలకు పోజులిస్తూ కనిపించాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచింది. దర్శకుడు రాజమౌళి దీనికి ఓకే చెప్పారా? స్వతహాగానే ఇలాంటి వాటిని రాజమౌళి అనుమతించరు. కానీ అనుమతి లభించింది. దీనికోసం మహేష్ ఏదైనా మ్యాజిక్ చేసారా? అంటూ ముచ్చటించుకుంటున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 లుక్ కోసం క్యూరియాసిటీ ఇప్పుడు లేదు. మహేష్ పొడవాటి గిరజాల జుత్తు, గుబురు గడ్డంతో కనిపించనున్నారని ఇప్పటికే రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి.
సినిమా ప్రారంభమయ్యాక మహేష్ ఎటువంటి బహిరంగ ప్రదర్శనలలో పాల్గొనలేదు. ఎప్పుడూ పెళ్లిళ్లు, పార్టీలకు హాజరు కాలేదు. మీడియాకు తన ముఖాన్ని చూపించలేదు. కానీ అతడి కొత్త లుక్‌తో మహేష్ వాణిజ్య ప్రకటన మాత్రం విడుదలైంది. కుమార్తె సితారతో కలిసి మహేష్ ఈ ప్రకటనలో కనిపించారు. మొత్తానికి వాణిజ్య ప్రకటన కమిట్ మెంట్ కోసం మహేష్ రాజమౌళిని ఒప్పించారని భావించవచ్చు.