మహేష్‌కి ప్రశ్న.. 18 ఏళ్ల కొడుకు బరిలోకొచ్చేదెపుడు?
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఈరోజు (ఆగస్టు 31న)తో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
By: Tupaki Desk | 31 Aug 2024 5:03 PM GMT''హ్యాపీ 18 సన్ !! ఈ సమయంలో అన్వేషించు & ఆనందించు..! నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను... ఈరోజు నేను గర్వించదగిన తండ్రిని''.. ఇదీ తనయుడు గౌతమ్ విషయంలో మహేష్ ఎమోషన్. 18 వయసుకు వచ్చేశాడు గౌతమ్ కృష్ణ. దీనర్థం అతడు ప్రేమించే వయసుకు ఎదిగాడు. అయితే ఇప్పుడు ప్రేమలో పడతాడా? అన్నది అటుంచితే, ఇకపై ప్రేమకథల్లో నటించాల్సిన టైమ్ వచ్చేసినట్టే!
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఈరోజు (ఆగస్టు 31న)తో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజున, మహేష్ బాబు తన 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన కొడుకు ఇస్మార్ట్ లుక్ తో అడల్ట్ గా మారిన విధానాన్ని ఎలివేట్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఇది నిజానికి అభిమానులు గౌతమ్ ని హీరోగా ఊహించుకునేలా చేస్తోంది. రాజకుమారుడి వారసుడొస్తున్నాడు! అంటూ సంబరాలు చేసుకునేలా చేసింది. ప్రేమ గర్వంతో నిండిన మహేష్ బాబు పోస్ట్ పై అభిమానులంతా తర్జన భర్జన పడుతున్నారు.
అభిమానులు శ్రేయోభిలాషులు గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. హీరోగా రావాల్సిందిగా కూడా పిలుపునిస్తున్నారు. అన్వేషించు.. ఆనందించు! అని మహేష్ ఆశీస్సులు అందించారు.. దీనర్థం కెరీర్ పరంగా అన్వేషణ మొదలు పెట్టాలని పిలుపునివ్వడమే. నటుడు అయితే సక్సెస్ వస్తుంది.. దానిని ఆనందించేందుకు కూడా గౌతమ్ సిద్ధంగా ఉండాలి. ఇకపోతే.. ఇంతకుముందే నమ్రత, సితార ఘట్టమనేని కూడా గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏది ఏమైనా గౌతమ్ యుక్తవయసులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే గౌతమ్ హీరోగా వచ్చేది ఎప్పుడు? అన్నదే ఇంకా సస్పెన్స్ లో ఉంది. నమ్రత కానీ, మహేష్ బాబు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలతో సరిపెడుతున్నారు కానీ, వారసుడు ఎప్పుడు వస్తాడు? అన్నది మాత్రం ఇంకా చెప్పడం లేదు. గౌతమ్ మహేష్ బాబు అడుగుజాడలను అనుసరించడానికి, నటనలోకి రావడానికి చాలా ఆసక్తిని కనబరుస్తున్నాడు అని ఫీలర్స్ మాత్రం వదిలారు. తాజాగా సోదరి సితార ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించింది. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్రామా కోర్సును అభ్యసిస్తున్నట్లు వెల్లడించింది.
గౌతమ్‌కి కళల పట్ల ఉన్న మక్కువ చాలా ఎక్కువ. అతను ఇటీవలే లండన్‌లో తన రంగస్థల అరంగేట్రం చేసాడు. అక్కడ అతను రోమియో జూలియట్ నాటకంలో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఈ షోకి తల్లిదండ్రులు సోదరి హాజరైన అతడి ప్రదర్శనకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని మహేష్ బాబు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇకపై మహేష్ వారసత్వాన్ని లెగసీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గౌతమ్ ఘట్టమనేనిపైనే ఉంది.