Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాక్షన్ సినిమా.. బోయపాటికి ఇంకా ఆశ ఉందా..?

అఖండ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 March 2025 3:35 PM
మహేష్ ఫ్యాక్షన్ సినిమా.. బోయపాటికి ఇంకా ఆశ ఉందా..?
X

టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. మిగతా సినిమాలు ఎలా ఉన్నా సరే ఆయన తీసే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. బోయపాటి సినిమా అంటే ఊర మాస్ బొమ్మ అనేలా ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యేలా చేసుకున్నాడు. అఖండ తో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను నెక్స్ట్ అఖండ 2 తో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.

ఇక ఇదిలాఉంటే బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఊర మాస్ డైరెక్టర్ తో మహేష్ బాబా ఇది సాధ్యమయ్యే పనేనా అనుకోవచ్చు. బోయపాటి సినిమా అంటే ఫ్యాక్షన్ కథలు లేదా ఊర మాస్ సినిమాలు. ఐతే కెరీర్ లో పెద్దగా అలాంటి ఫ్యాక్షన్ కథలు చేయని మహేష్ కి కచ్చితంగా కొత్తగానే ఉంటుంది. అంతేకాదు మహేష్ బోయపాటి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఐతే మహేష్ ని వైట్ అండ్ వైట్ డ్రస్ లో ఒక పక్కా ఊర మాస్ సినిమా చేయాలని కొన్నాళ్లుగా బోయపాటి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు అనుకోవడమే తప్ప అది సాధ్య పడలేదు. ఐతే బోయపాటి శ్రీను తో మహేష్ సినిమా ఇక మీదట సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకోబోతున్నాడు. సో జక్కన్నతో తీశాక మళ్లీ అదే రక్తపాతం సినిమాలు చేస్తాడని చెప్పలేం.

మహేష్ ని ఎగ్జైట్ చేసే కథ రాసుకుంటే అది కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని అనిపిస్తే మాత్రం బోయపాటి కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే జక్కన్న సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్లు టైం ఇచ్చాడు. నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను మాత్రం తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్న కల్ట్ మాస్ సినిమాలే చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరింపచేస్తున్నాడు.

ఫ్యూచర్ లో మహేష్ తో బోయపాటి సినిమా చేస్తాడా అన్నది తెలియదు కానీ డైరెక్టర్ మాత్రం సూపర్ స్టార్ తో సినిమా ఆశ వదులుకోవట్లేదని తెలుస్తుంది. ఐతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బోయపాటి శ్రీను సినిమాల్లో మహేష్ బాబు అనగానే ఆహా ఆ ఊహే ఎంత బాగుందో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మరి బోయపాటి కి ఏమాత్రం లక్ ఫేవర్ చేసినా బాబుతో సినిమా పడే ఛాన్స్ ఉంటుంది.