Begin typing your search above and press return to search.

సుకుమార్ కుమార్తె సినిమాకి మ‌హేష్ ప్రోత్సాహం

ఇప్పుడు కంటెంట్ ఉన్న ఓ తెలుగు సినిమా కోసం అత‌డు త‌న‌వంతు ప్ర‌చార సాయం అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:12 AM GMT
సుకుమార్ కుమార్తె సినిమాకి మ‌హేష్ ప్రోత్సాహం
X

ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఎప్పుడూ ముందుంటారు. త‌న సొంత బ్యాన‌ర్‌లో ఇత‌ర హీరోల‌తోను సినిమాలు చేస్తున్నారు. ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, ద‌ర్శ‌కుల‌ను మ‌హేష్ ప్రోత్స‌హిస్తున్నారు. ఇత‌ర సినిమాల ట్రైల‌ర్ లు, ఫ‌స్ట్ లుక్ లాంచ్ ల‌కు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్నారు. ఇప్పుడు కంటెంట్ ఉన్న ఓ తెలుగు సినిమా కోసం అత‌డు త‌న‌వంతు ప్ర‌చార సాయం అందిస్తున్నారు. ట్రైల‌ర్ స్వ‌యంగా లాంచ్ చేసి యువ‌త‌రంలో ఉత్సాహం నింపుతున్నారు.

'గాంధీ తాత చెట్టు' ట్రైలర్‌ను మ‌హేష్ లాంచ్ చేయనున్నారని స‌మాచారం. డైరెక్ట‌ర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఒక మనిషికి చెట్టుకు మధ్య ప్రేమకథ ఇది. ప‌ద్మావతి మల్లాడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్- సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది.

ఇది ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం కృషి చేసే 15 ఏళ్ల బాలిక క‌థ‌. తన తాత నుండి నేర్చుకున్న గాంధీ సూత్రాలను అనుసరించి పర్యావరణహిత లక్ష్యం కోసం ఆ బాలిక‌ పోరాడుతుంది. ఈ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘు రామ్, భాను ప్రకాష్, నేహల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రం జనవరి 24న విడుదలవుతోంది. మ‌హేష్ అంత‌టి పెద్ద స్టార్ ప్ర‌చారం చేస్తున్నారు కాబ‌ట్టి అది సినిమాకి ప్ల‌స్ కానుంది.