Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ రూట్.. కంప్లీట్ సెపరేట్!

దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేయాల్సిన ఉన్న ప్రాజెక్ట్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు మహేష్ బాబు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 5:55 AM GMT
మహేష్ ఫ్యాన్స్ రూట్.. కంప్లీట్ సెపరేట్!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వేరే లెవెల్ లో అభిమానులు ఉన్న ఆయన.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం మేకోవర్ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేయాల్సిన ఉన్న ప్రాజెక్ట్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు మహేష్ బాబు.

అయితే ఇంకా షూటింగ్ స్టార్ట్ కాని SSMB 29.. రిలీజ్ అవ్వడానికి టైమ్ పట్టేలా కనిపిస్తోంది. 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా అప్డేట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో రీసెంట్ గా వచ్చిన ముఫాసా మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో SSMB 29 రావడానికి టైమ్ పడుతుంది కనుక.. ముఫాసా సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. థియేటర్స్ బయట పెద్ద పెద్ద కటౌట్లు కట్టి తెగ సందడి చేశారు. కేక్ కట్ చేసి మహేష్ ఓన్ మూవీ అన్నట్లు సంబరాలు చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ చేసి యూఎస్ లో ఇంగ్లీష్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా వేశారు నిర్వాహకులు.

ఇప్పుడు గుంటూరు కారం రీ రిలీజ్ కు సిద్ధమైపోతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా డివైడ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో రీ రిలీజ్ కు రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంతా అనుకున్నారు. అందుకు విరుద్ధంగా ఉంది పరిస్థితి. హైదరాబాద్ లో వేయనున్న 2 షోల టికెట్స్ అన్నీ అప్పుడే బుక్ అయిపోయాయి.

దీంతో ఇప్పుడు సుదర్శన్ తోపాటు దేవి థియేటర్స్ లో కూడా షోస్ వేయనున్నట్లు తెలుస్తోంది. అలా మరిన్ని షోలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సై, హిట్లర్, ఓయ్, రఘువరన్ బీటెక్ వంటి పలు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నా.. అడ్వాన్స్ బుకింగ్స్ మోస్తరుగానే జరుగుతున్నాయి. కానీ మహేష్ మూవీ దూసుకుపోతోంది.

అది కూడా రీ రిలీజ్ అవ్వనున్న థియేటర్స్ లో వారం ముందు హౌస్ ఫుల్ అవ్వడం మామూలు విషయం కాదు. దీంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ రూటే సెపరేట్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరేంటి బాబూ ఇలా ఉన్నారని సరదాగా అంటున్నారు. నిన్న ముఫాసా.. నేడు గుంటూరు కారం.. మహేష్ ఫ్యాన్స్ అభిమానమే వేరని చెబుతున్నారు. అది నిజమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదేమో!