మహేష్ 'ముఫాసా'.. పులి బదులు పిల్లిని తీసుకొచ్చేశారుగా!
అయితే ఓ థియేటర్ వద్దకు పిల్లిని తీసుకొచ్చారు మహేష్ బాబు ఫ్యాన్స్. సినిమాలో సింహం పిల్లను ఎత్తుకున్న ఐకానిక్ షాట్ ను రీక్రియేట్ చేశారు.
By: Tupaki Desk | 20 Dec 2024 5:18 PM GMTహాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ కు వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన లయన్ కింగ్ సీక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేయగా.. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగు సినీ ప్రియులు కూడా ముఫాసా మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. అందులో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అయితే మరీ ఎక్కువగా ఎదురుచూశారు. దానికి కారణం.. ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే. స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందా.. మహేష్ వాయిస్ ను ఎంజాయ్ చేస్తామా.. అనే ఆసక్తితో ఇన్నిరోజులు గడిపారు.
ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మహేష్ బాబు యాక్ట్ చేసిన మూవీకి చేసినట్లు.. ముందు రోజు నుంచే హంగామా స్టార్ట్ చేశారు. భారీ కటౌట్లు కట్టారు. నేడు పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకున్నారు. వేరే లెవెల్ లో రచ్చ చేస్తున్నారు. కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చినా... సినిమాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఓ థియేటర్ వద్దకు పిల్లిని తీసుకొచ్చారు మహేష్ బాబు ఫ్యాన్స్. సినిమాలో సింహం పిల్లను ఎత్తుకున్న ఐకానిక్ షాట్ ను రీక్రియేట్ చేశారు. అందుకు సంబంధించిన పిక్స్.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదెక్కడి అభిమానం రా బాబు, క్రేజీగా ఉన్నారుగా అని ఫన్నీగా అనేక మంది కామెంట్లు పెడుతున్నారు.
ఇక ముఫాసా సింహాల స్టోరీ అన్న విషయం తెలిసిందే. అందుకే సింహాలను ఎలాగో తీసుకురాలేరు కదా.. అందుకే పిల్లిని తీసుకొచ్చినట్లు ఉన్నారు. అయితే ముఫాసాకు డబ్బింగ్ చెప్పడం అద్భుతమైన అనుభవమని మహేష్ రీసెంట్ గా ట్వీట్ చేశారు. దాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.
మరోవైపు, మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో చేయాల్సిన సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ముఫాసాతో ఎంజాయ్ చేస్తున్నారు.