Begin typing your search above and press return to search.

మ‌సాయి...పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య‌ సూప‌ర్ స్టార్ ట్రైనింగ్!

రాజ‌మౌళి అదేశాల మేర‌కు జ‌పాన్ బృందంలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 2:30 PM GMT
మ‌సాయి...పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య‌ సూప‌ర్ స్టార్ ట్రైనింగ్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌ఠిన‌మైన ట్రైనింగ్ కి స‌న్న‌ధం అవుతున్నాడా? మ‌సాయి-పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య స్పెష‌ల్ ట్రైనింగ్ కి వెళ్తున్నాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్ద‌మైంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్న‌యి. అలాగే మ‌హ‌ష్ జపాన్ లో పాత్ర కోసం కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

రాజ‌మౌళి అదేశాల మేర‌కు జ‌పాన్ బృందంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ ఇది బేసిక్ ట్రైనింగ్ మాత్ర‌మే. ఆస‌లైన ట్రైనింగ్ ఇప్పుడు మొద‌ల‌వుతుంది. ఇది ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని ముందే రివీల్చేసారు. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతుంది. బ్యాక్ డ్రాప్ ని బ‌ట్టి చూస్తే షూట్ అంతా ఆఫ్రికాలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. అవ‌స‌రం మేర రాజ‌మౌళి ఒరిజిన‌ల్ లొక‌ష‌న్ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది.

అయితే అంత‌కంటే ముందే జ‌క్క‌న్న మ‌హేష్ ని క‌ఠిన‌మైన ట్రైనింగ్ కోసం చీక‌టి ఖండానికి పంపిస్తు న్నార‌ని స‌మాచారం. అక్క‌డ ఆట‌విక జాతుల మ‌ధ్య మ‌హేష్ కోసం స్పెష‌ల్ ట్రైనింగ్ ఉంటుందిట‌. పీగ్మీలు..మ‌సాయి తెగ‌ల మ‌ధ్య 20 రోజుల పాటు క‌ఠిన‌మైన బేసిక్ ట్రైనింగ్ ఉంటుందిట‌. దానికి సంబంధించిన ప‌ర్యాట‌క ఏజెన్సీల‌ను ఇప్ప‌టికే రాజ‌మౌళి టీం సంప్రదించిందిట‌.

ముంబై లో ఉన్న‌ టీమ్ తో క‌లిసి మ‌హేష్ ఆఫ్రికా వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. పిగ్మీలు అంటే కాంగో న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉంటారు. తూర్పు ఆఫ్రికాలో మ‌సాయి తెగ ఉంటుంది. ఈ రెండు తెగులు క‌లిసి ఉన్న చోట ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి రాజ‌మౌళితో ఆట ఎలా ఉంటుందో? మ‌రికొద్ది రోజుల్లో మ‌హేష్ కి తెలియ‌నుంది. ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్ ఇదే విష‌యాన్ని ముందే జోస్యం చెప్పారు. రాజ‌మౌళితో సినిమా చేస్తున్నారుగా? బాగా ఆడ‌తార‌ని అప్పుడే హింట్ ఇచ్చాడు. కానీ అప్పుడు మ‌హేష్‌కి అర్దం కాలేదు. త్వ‌ర‌లో ట్రైనింగ్ మొద‌లైతే అర్ద‌మ‌వుతుంది.