రీ రిలీజ్ లైన్ లో మహేష్ డిజాస్టర్..
ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది. రీరిలీజ్ అవుతోన్న సినిమాలకి ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
By: Tupaki Desk | 3 Sep 2024 1:36 PM GMTప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది. రీరిలీజ్ అవుతోన్న సినిమాలకి ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో పాత సినిమాలని మరల ఏదో ఒక వెకేషన్ కి 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలని ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రీరిలీజ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సినిమాలు మంచి వసూళ్లని అందుకుంటున్నాయి. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాని రీరిలీజ్ చేశారు.
ఈ సినిమాకి 9 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. తరువాత మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇంద్ర సినిమాని 4Kలో రీరిలీజ్ చేశారు. దీనికి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకొని గబ్బర్ సింగ్ సినిమాని రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకి మొదటి రోజే 4 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. తుఫాన్, వరద ప్రభావం ఉన్న కూడా గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఫ్యాన్స్ తరలి వెళ్లారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు డిజాస్టర్ మూవీ ఖలేజాని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులకి అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే డిజప్పాయింట్ అయ్యారు. తరువాత టీవీలలో ఖలేజా సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఓటీటీలో కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇప్పటికే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసి ఉంటారు.
రీరిలీజ్ అవుతున్న వాటిలో స్టార్ హీరోల మాస్ మూవీస్ మాత్రమే ఎక్కువ ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఖలేజా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా చాలా మందికి నచ్చిన థియేటర్స్ లో మరల ఎంత వరకు చూస్తారనేది ప్రశ్న. 4K వెర్షన్ ట్రైలర్ ని కూడా ఇప్పటికే రెడీ అవుతోందంట. మంచి వెకేషన్ చూసుకొని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారంట.
త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతోనే టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత బిజినెస్ మెన్ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. దానికి మంచి ఆదరణ లభించింది. అన్నిటికంటే మురారి చిత్రం ఎక్కువ వసూళ్లు సాధించింది. మరి ఖలేజా రీరిలీజ్ అయితే మురారి కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.