Begin typing your search above and press return to search.

SSMB 29.. అంతా జక్కన్న మాయ!

అలాంటి విధంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి.. సక్సెస్ ఫుల్ గా డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 2:45 AM GMT
SSMB 29.. అంతా జక్కన్న మాయ!
X

ఎస్ ఎస్ రాజమౌళి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్ అని చెప్పాలి. తన వర్క్ తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారాయన. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ విక్టరీ అందుకున్నారు. మరోసారి వరల్డ్ వైడ్ గా తన సత్తా ఏంటో చూపించారు. మూవీ మేకింగ్ కు గాను బోలెడు ప్రశంసలు సొంతం చేసుకున్నారు. జక్కన్న చిత్రాల రేంజే వేరని అంతా అనేలా చేశారు. అయితే రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయగా.. దాని ద్వారా రాజమౌళి టాలెంట్ ఏంటో మరోసారి క్లియర్ గా తెలుస్తుంది. ఒక సినిమాలోని ఒక్కో సీన్ ను జక్కన్న ఎంత చెక్కుతారో అర్థమవుతుంది. అలాంటి విధంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి.. సక్సెస్ ఫుల్ గా డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.

ఇక సినిమాల విషయంలో రాజమౌళి రూట్ వేరుగా ఉంటుంది. సైలెంట్ గా తన పనిని తాను చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ లో అన్ని పనులు కంప్లీట్ చేస్తుంటారు. అన్నీ రెడీ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తారు. కానీ ఇంతలో లీక్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వినిపిస్తుంటాయి. కానీ జక్కన్న వాటి వైపు కన్నెత్తి కూడా చూడరేమో.

ఎన్ని పోస్టులు కనిపిస్తున్నా.. ఎన్ని వార్తలు వస్తున్నా.. గుట్టుగా పనికానిచ్చేడం మన జక్కన్న స్టైల్. లొకేషన్స్ ఫిక్సింగ్ నుంచి క్రూ అండ్ క్యాస్టింగ్ సెలక్షన్ వరకు తన స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. ప్రతి విషయంలో రాజమౌళి మార్క్ కనిపిస్తుంటుంది. అలా తన సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జక్కన్న డిసెషన్ తీసుకున్నారంటే వెనుక ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది.

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ కాకుండా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు జక్కన్న. ఆ మధ్య ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ లైన్ పై చిన్న లీక్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణినేని తీసుకున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

హీరో, మ్యూజిక్ డైరెక్టర్ తప్ప సినిమా కోసం మరో విషయం కూడా తెలియదు. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ జక్కన్న మాత్రం సైలెంట్ గా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఓవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే.. మరోవైపు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. దీంతో ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు.

నిజానికి రాజమౌళి.. ప్రెస్ మీట్ పెట్టి తన సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ప్రకటిస్తారు. దీంతో మహేష్ మూవీ డిటైల్స్ ఎప్పుడు రివీల్ చేస్తారోనని చూస్తున్నారు. అది త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే జక్కన్న.. ప్రస్తుతం లొకేషన్లను ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫారిన్ లో లొకేషన్స్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసినట్లు టాక్. గండిపేటతోపాటు అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంతంలో కూడా సెట్స్ వేశారట. అదే సమయంలో ఇప్పుడు క్యాస్టింగ్ విషయంలో జక్కన్న తన స్ట్రాటజీ క్లియర్ గా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ హీరోయిన్ అండ్ విలన్ ఫిక్స్ అయినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను రాజమౌళి ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు ఫారిన్ వెళ్లిపోయాక హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో అలరించారు. అలా వరల్డ్ వైడ్ గా ఫేమ్ సొంతం చేసుకున్నారు ప్రియాంక చోప్రా.

అయితే మహేష్ బాబు- ప్రియాంక చోప్రా కాంబో ఎవరూ ఊహించనిదనే చెప్పాలి. రాజమౌళి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదో ప్లాన్ ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీ కనుక ఆమెకు వరల్డ్ వైడ్ గా ఉన్న గుర్తింపు.. SSMB 29కు కచ్చితంగా పనికొస్తుంది. అందుకే సెలెక్ట్ చేశారేమో.

సినిమాలో విలన్ గా స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయ్యారట. ఆయనకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి.. క్యాస్టింగ్ విషయంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి ఇప్పటివరకు ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమా కోసం ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. 2025 జనవరిలో షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తోంది. రెండేళ్ల పాటు షూటింగ్ ను జరపనున్న జక్కన్న.. 2027లో మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరి అనుకున్నట్లు రాజమౌళి సినిమాను రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.