Begin typing your search above and press return to search.

రాజమౌళి ప్లాన్.. ఫ్యాన్స్ లో ఓ టెన్షన్?

అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పూర్తిగా వరల్డ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Feb 2025 8:30 PM GMT
రాజమౌళి ప్లాన్.. ఫ్యాన్స్ లో ఓ టెన్షన్?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 ప్రాజెక్ట్‌పై అటు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దశల వారీగా సాగుతుండగా, ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కథ, కథనానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పూర్తిగా వరల్డ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి.

సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఫిక్స్ అయిందని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఇక మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా సినిమాలో నటిస్తున్నాడనే గాసిప్ కూడా వైరల్ అవుతోంది. అయితే తాజాగా మరో హాలీవుడ్ నటి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

అంతేకాకుండా, సినిమాకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని బయటకు లీక్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్‌లో పనిచేస్తున్న నటీనటులు, టెక్నీషియన్లు అందరూ నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (NDA) కుదుర్చుకున్నారని అంటున్నారు. అంటే సినిమా గురించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థం.

అయితే తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఒకే మల్టీపార్ట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందా అనే చర్చ నడుస్తోంది. మూడు భాగాలుగా చేయనున్నాడు అనేలా మరికొన్ని గాసిప్స్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదటి పార్ట్ పూర్తయిన వెంటనే రెండో భాగం షూటింగ్ చేస్తారా? మహేష్ డేట్స్ ఎలా ప్లాన్ చేస్తాడు? ప్రభాస్ చేసినట్టుగా మహేష్ కూడా 5 ఏళ్లపాటు తన కెరీర్‌ను రాజమౌళి ప్రాజెక్ట్‌కు అంకితమిస్తాడా అనే ప్రశ్నలు అభిమానుల్లో కలవరం కలిగిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాజమౌళి మల్టీపార్ట్ ప్రాజెక్ట్‌లను ఇంతకుముందు సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన అనుభవం ఉండటంతో SSMB 29 కూడా ఆ లైన్లో ఉండే అవకాశముందని భావిస్తున్నారు. అయితే మహేష్ అభిమానులు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రాజమౌళి ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా తన విజన్‌ను అనుసరించి గ్రాండ్‌గా డిజైన్ చేసి, సక్సెస్ చేయడం ఖాయం. అంతేకాకుండా, ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు రాకుండా ఉండటానికి చిత్రబృందం కఠిన చర్యలు తీసుకుందని సమాచారం. KL నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, గ్లోబల్ లెవల్‌లో భారీ విజయం సాధించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.