NYC వీధుల్లో మహేష్ వర్సెస్ సితార
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్- సితారతో కలిసి కొద్దిరోజులుగా న్యూయార్క్(అమెరికా)లో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే.
By: Tupaki Desk | 4 Sep 2024 8:10 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్- సితారతో కలిసి కొద్దిరోజులుగా న్యూయార్క్(అమెరికా)లో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. కుమారుడు గౌతమ్ కృష్ణ ఉన్నత విద్య కోసం NYC విశ్వవిద్యాలయంలో చేరాడు. దీంతో నిరంతరం మహేష్ అతడి కుటుంబం గౌతమ్ కి ఒంటరి అన్న ఫీలింగ్ రాకుండా చేయడానికి రెగ్యులర్ గా వెళ్లి వస్తున్నారు. ఎన్‌వైసీకి వెళితే మహేష్ కుటుంబానికి ప్రతిదీ సింపుల్‌గా మారుతుంది. అనవసర హంగామా ఉండదు గనుక... ఇదిగో ఈసారి విజిట్ లో కూడా తన కుమార్తె సితారతో కలిసి అక్కడ అందమైన వీధుల్లో విహరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు విడుదలయ్యాయి. వీటిని షేర్ చేసిన నమ్రత ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
తండ్రీకూతుళ్లు నగరంలోని వీధుల్లో షికారు చేశారు. కెమెరాకు ఫోజులివ్వని వారి ముఖాలు ప్రత్యేక శోభతో కనిపిస్తున్నాయి. ఒక ఫోటోగ్రాఫ్ లో ఇద్దరూ ఒకరినొకరు వామ్ హగ్ తో ప్రేమ ఆప్యాయతలను ప్రదర్శించడం అవిభాజ్యంగా కనిపించింది. ఇది అందమైన మనోహరమైన క్షణం. మహేష్ తన జీవితంలో అత్యుత్తమ ఆనందకర క్షణాలను ఆస్వాధిస్తున్నారని అర్థమవుతోంది. తన చిన్నపిల్లతో ఒక చిన్న పిల్లాడిలా కలిసిపోయే మహేష్ ఇప్పుడు కూడా సితారతో కలిసి చాలా చిన్న పిల్లవాడైపోయాడు. చాలా ఆనందంగా కనిపించాడు. సితా పాప పైకి కనిపించదు కానీ చాలా అల్లరి అమ్మాయి. తన డాడీతో కలిసి విహారానికి వెళితే ఎలాంటి సందడి చేస్తుందో ఇక్కడ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ అందమైన ఫోటోగ్రాఫ్స్ వీక్షించాక సితార అచ్చం మహేష్ ని పోలి ఉందని కొందరు వ్యాఖ్యానించగా, NYC వీధుల్లో మహేష్ వర్సెస్ మహేష్!? అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానించారు. సితార కళ్లు, ముకు తీరు రూపం ప్రతిదీ మహేష్ కి జెరాక్స్ లా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సితార, గౌతమ్ ఇద్దరి పోలికలు మహేష్ ని పోలి ఉంటాయనేది అభిమానుల మెజారిటీ అభిప్రాయం.
కేవలం 12 సంవత్సరాల వయస్సులో తనకంటూ భారీ అభిమానులను సృష్టించుకున్న సితార గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో తన తండ్రితో ఎంత సన్నిహితంగా సరదాగా ఉంటుందో వెల్లడించింది. ప్రపంచం మొత్తం మహేష్ బాబును సూపర్ హీరోగా చూస్తుంటే, ఇంటికి తిరిగి వచ్చిన అతడు కేవలం తనకు డాడీ మాత్రమేనని సితార పేర్కొంది.
సితార మాట్లాడుతూ, ``నిజాయితీగా చెప్పాలంటే అందరూ డాడీని సూపర్ హీరోగా భావిస్తారు. కానీ నాకు అలా కాదు ఎప్పటికీ. నేను నాన్న సినిమాలు చూసేటప్పుడు ఆ విధంగానే చూస్తాను. కానీ ఇంట్లో నా డాడీ మాత్రమే`` అని వ్యాఖ్యానించారు సితార. తన తండ్రికి ఇష్టమైన సినిమాని వెల్లడించమని ప్రశ్నించగా, వెంటనే ఖలేజా అని వ్యాఖ్యానించింది. మహేష్ కి ఆ సినిమా నచ్చడానికి కారణం `ఖలేజా` సినిమా నాకు చాలా నచ్చింది కాబట్టి! అని చెప్పింది. సితార ప్రతి ప్రత్యేక క్షణాన్ని మహేష్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తారు. 20 జూలై 2024న తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్ట్ తో ఆనందపరిచారు. సితారకు 12 ఏళ్లు! అని తెలియజేసారు మహేష్. ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.