తోబుట్టువులతో సూపర్ స్టార్ మహేష్!
వెళ్తే కుటుంబంతో విదేశాలకు వెళ్లడం లేదంటే ఇంట్లో...ఆ రెండు లేవంటే సినిమా సెట్స్ లో ఉంటారు.
By: Tupaki Desk | 20 Nov 2024 12:01 PM GMTసూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీతో ఎంతగా ఆస్వాదిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ఖాళీ సమయం దొరికితే కుటుంబం తోనే ఎక్కకువగా గడుపుతుంటాడు. ఆయనకు ఇండస్ట్రీ ఉన్న స్నేహితులు కూడా చాలా తక్కువ కావడంతో బయట తిరగడం? స్నేహితులతో షికార్లు వంటివి కూడా పెద్దగా ఉండవు. వెళ్తే కుటుంబంతో విదేశాలకు వెళ్లడం లేదంటే ఇంట్లో...ఆ రెండు లేవంటే సినిమా సెట్స్ లో ఉంటారు.
అంతకు మించి మహేష్ స్పెషల్ ప్లానింగ్ లు అంటూ ఏవీ ఉండవు. అలాగే కుటుంబంలో ఏ వేడుకలు జరిగినా తప్పకుండా ఫ్యామిలీతో హాజరవుతుంటారు. చుట్టాలు.. స్నేహితులు..ఇండస్ట్రీ ఇలా ఎవరింట వేడుక జరిగినా తప్పక హాజరవుతుంటారు. మొదట్లో కొంత కాలం పాటు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉన్నా? ఇప్పుడు మహేష్ ఎంతో ప్రీగా ఉంటున్నారు. కుటుంబ జీవితం తనలో ఎన్నో రకాల మార్పులకు దోహద పడిందని చాలా సందర్భాల్లో రివీల్ చేసాడు.
తాజాగా సూపర్ స్టార్ మరోసారి అక్కా-చెల్లుళ్లు..బావ..వాళ్ల పిల్లలందరితో కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పిక్ ని మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల షేర్ చేశారు. తన పుట్టినరోజు వేడుకల్ని ఇలా కుటుంబ మంతా దగ్గరుండి సెలబ్రేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ , తన పిల్లలు సహా నమ్రత ఉన్నారు. అలాగే సుధీర్ బాబు, అతడి భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పిల్లలు అంతా ఉన్నారు. వీరంతా ఒకే ప్రేమ్ లో ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మహేష్ 29వ సినిమా కోసం సన్నధం అవుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి నిర్వహిస్తోన్న వర్క్ షాపుల్లో పాల్గొంటున్నాడు. ఈ మధ్యనే కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో ఇలా ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మహేష్ ఫోటో దొరకడం కూడా కష్టమే.