మహేష్-రాజమౌళి ఆ ఛాన్స్ ఎవరికిస్తారు?
ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2024 11:30 PM GMTఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీంతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ దుర్గా ఆర్స్ట్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మిస్తు న్నారు. గతంలో ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ చాలా కాలంగా నిర్మాణానికి దూరంగా ఉంది. మళ్లీ మహేష్ సినిమాతోనే కంబ్యాక్ అవుతుంది.
రాజమౌళి ..నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా సదరు బ్యానర్ బాధ్యతలు తీసుకుంటుంది. మరి ఈ సినిమాని నారాయణ ఒక్కడే నిర్మిస్తున్నాడా? ఇంకా భాగస్వాములు జాయిన్ అవుతున్నారా? అందుకు ఛాన్స్ ఉంది. ఈసినిమా బడ్జెట్ ఎంత అన్నది ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఇది రెండు భాగాలుగా వస్తుందా? ఒక భాగంగా వస్తుందా? అన్నది కూడా తెలియదు. `బాహుబలి` రెండు భాగాలకు కలిపి 500 కోట్ల వరకూ ఖర్చు చేసారు. అటుపై తెరకెక్కించిన ఒకే చిత్రంగా రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` కోసం రాజమౌళి 500 కోట్లకు పైగా వెచ్చించారు.
ఇద్దరు స్టార్ హీరోల్ని పెట్టుకుని ఒకే సినిమాకి ఇంత బడ్జెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో మహేష్ తో సినిమా అంటే అంతకు మించే ఉంటుంది తప్ప! తగ్గడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఈసినిమా బడ్జెట్ 700 కోట్లు..అంతకు మించి ఉండటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ తీసుకుంటే ఇంత బడ్జెట్ ఒకే నిర్మాణ సంస్థ పై కూడా జక్కన్న మోపడానికి ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి. సినిమా ఫలితం ఎలా ఉంటుంది? అన్నది ఎవరూ ముందుగా చెప్పలేనిది.
ఒక్కరితోనే అంత పెట్టుబడి పెట్టించి ఫెయిలైతే నిర్మాత పరిస్థితి ఏంటి? అన్న కోణంలోనూ మేకర్స్ ఆలోచిస్తారు. నిర్మాతని సేఫ్ జోన్ లో ఉంచడం దర్శకుడి బాధ్యత. ఇవన్నీ ఆలోచిస్తే ఎస్ ఎస్ ఎంబీ 29 లో భాగస్వాములు చేరే అవకాశం ఉంటుందని గెస్సింగ్స్ వినిపిస్తున్నాయి. మహేష్-రాజమౌళి సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టడానికి ఎంతో మంది నిర్మాతలు ముందుకొస్తారు. కానీ ఆ ఛాన్స్ రాజమౌళి-మహేష్ ఎవరికిస్తారు ? అన్నది ముఖ్యం.